Telugu News

తెలంగాణ తల్లి సోనియమ్మ: పొంగులేటి 

వరాలిచ్చేందుకే తెలంగాణకు సోనియమ్మ...!

0

తెలంగాణ తల్లి సోనియమ్మ: పొంగులేటి 

== వరాలిచ్చేందుకే తెలంగాణకు సోనియమ్మ…!

== పది లక్షల మందితో సభ విజయవంతానికి ఏర్పాట్లు

== ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులందరూ తరలిరండి

== తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి

== పాలేరు, మధిర, ఖమ్మం, వైరా నియోజకవర్గాల్లో పర్యటన

(ఖమ్మం-విజయంన్యూస్):

 తెలంగాణ ప్రజానీకానికి వరాలిచ్చేందుకే తెలంగాణకు సోనియమ్మ వస్తున్నారని… ఈ సభను పది లక్షల మందితో విజయవంతం చేసేందుకు టీపీసీసీ నేతృత్వంలో ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్ మండలాల్లో, మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలం, ఖమ్మంనియోజకవర్గం ఖమ్మం నగరంలోని గాంధీచౌక్, బోసుబొమ్మ సెంటర్ ప్రాంతాల్లో, వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల, వైరా పట్టణాల్లో ఆదివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయా ప్రాంతాల్లో జరిగిన శు భకార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.

ఇది కూడా చదవండి: చంద్రబాబుకు షాక్.. 14 రోజుల రిమాండ్

ఆర్థికసాయాలను కూడా అందజేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రాబోవు ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే సంక్షేమ పథకాల వివరాలను తద్వారా తెలంగాణ ప్రజానీకానికి చేకూరే ప్రయోజనాలను వివరించేందుకు ఈనెల 17వ తేదీన హైదరాబాద్ కు వస్తున్నారన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రజల కోసం ఐదు డిక్లరేషన్లు ప్రకటించి స్పష్టమైన హామీ ఇవ్వగా అధికారంలోకి వచ్చాక అమలు చేసే మరికొన్ని వరాలను సోనియమ్మ ప్రకటించనున్నారని తెలిపారు. పది లక్షల మందితో ఈ సభ విజయవంతానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. కావున ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ లక్షలాదిగా తరలివచ్చి ఈ సభ దిగ్విజయంలో తమ వంతు కీలక పాత్ర పోషించాలని పొంగులేటి పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో పొంగులేటితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, మెనిఫెస్టో కమిటీ సభ్యులు మువ్వా విజయబాబు, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, పాలేరు నియోజకవర్గ నాయకులు చావా శివరామకృష్ణ, వైరా నియోజకవర్గ నాయకురాలు విజయబాయి, కార్పొరేటర్ మలీదు జగన్, బజ్జూరి వెంకట్ రెడ్డి, నెల్లూరి భద్రయ్య, కొడాలి గోవిందరావు, దేవరపల్లి అనంత రెడ్డి, గుమ్మా రోశయ్య, బాణాల లక్ష్మణ్, షేక్ ఇమామ్, కల్లెం వెంకట్ రెడ్డి, గోనె భుజంగ రెడ్డి, అజ్మీరా అశోక్ నాయక్, గురుమూర్తి, తిప్పి రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సర్పంచ్ పరికపల్లి శ్రీను తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవంఢి: ఖమ్మం కాంగీ‘రేస్’లో ఎవరు..?