ఉద్యమ ద్రోహి దిండిగల: కోరం కనకయ్యను అనుచరులు ఫైర్
– మంత్రి వ్యాఖ్యలను సమర్థించడం సిగ్గుచేటు
– నీ పదవి కోరం కనకయ్య బిక్ష
– ఉద్యమకారులపై కేసులవుతున్న నోరు మెదపని లీడర్ మీరు
– షాడో ఎమ్మెల్యే కు ప్రతి సవాల్ ఇసురుతున్నాం
– భూకబ్జాలపై అఖిలపక్షంతో చర్చకు కూర్చుందాం
– తేదీ సమయం మీరే చెప్పాలి
– పేరుకే ఎమ్మెల్యే పెత్తనం అంతా షాడో ది
– విలేకరుల సమావేశంలో కోరం కనకయ్యను అనుచరులు ఫైర్
(ఇల్లెందు-విజయం న్యూస్)
జిల్లా గ్రంధాలయ చైర్మన్ దిండిగల రాజేందర్ ఉద్యమ ద్రోయి అంటూ ఉద్యమకారుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య నాగేశ్వరరావు ఆరోపించారు. ఈ మేరకు బుధవారం కోరం కనకయ్య క్యాంప్ ఆఫీసులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉద్యమకారులపై షాడో ఎమ్మెల్యే కేసులు బనాయిస్తున్న చూస్తూ మౌనవ్రతం వహించిన ఉద్యమకారుడని ఎద్దేవా చేశారు. పదవికి అనర్హుడైన పదవి ఇప్పిచ్చిన ఘనత కోరం కనకయ్యకే దక్కిందన్నారు. ఉద్యమకారులకు కోరం కనకయ్య పెద్దపీట వేశారన్నారు.
ఇది కూడా చదవండి: కొణిజర్లలో ఘోర ప్రమాదం..ముగ్గురు మృతి
దిండిగలకు గ్రంథాలయం తనకు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఇచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. అంతేకాదు ఉద్యమకారులకు పార్టీ పదవులు ఇచ్చి గౌరవించిన వ్యక్తి కోరం కనకయ్య అన్నారు. ఉద్యమకారులపై కేసులు బనాయించి పీడిస్తున్న ఏకైక వ్యక్తి షాడో ఎమ్మెల్యే అని అన్నారు. భూ కబ్జాలు, దండాలు ,చందాలు విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నది నియోజవర్గ ప్రజలకు తెలుసు అన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్గా పదవి కాలం ముగిసిన ఇంకా ప్రోటోకాల్ వాడుకోవడం అధికార దుర్వినియోగమేనని ఆరోపించారు. కోరం కనకయ్య పై ఆరోపణలు చేసే ముందు మీ చరిత్ర ఏంటో తెలుసుకోవాలని సూచించారు. ప్రతిచోట చదువుకున్న వాళ్ళం చదువుకున్న వాళ్లమని చెప్పుకుంటూ చదువురాని మూర్ఖులుగా వ్యవహరిస్తున్నారు అన్నారు. కోరం కనకయ్య హయాంలో 1500 కోట్లు ఇల్లందుకు నిధులు రాబట్టాడు అన్నారు. అభివృద్ధి కోసం పార్టీ మారాడని తెలిపారు ప్రజలకు ప్రామిస్ చేసి పార్టీ మారిన చరిత్ర మీది అని సూటిగా చెప్పారు. షాడో ఎమ్మెల్యే కారణంగా ఎమ్మెల్యేకు టికెట్ వచ్చే అవకాశం లేదన్నారు. ఇప్పటికైనా అవాకులు చివాకులు పేలుస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో బోళ్ళ సూర్యం, పత్తి రంజిత్, స్వప్న ,ధనుంజయ్ సువర్ణపాక సత్యనారాయణలు మాట్లాడారు. ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: అజయ్ నీ వైఖరి మార్చుకో: పొంగులేటి అనుచరులు