గుంటు మల్లేశ్వరుడిని దర్శించుకున్న ఎంపీ రవిచంద్ర
== ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు
ఖమ్మం, నవంబర్, 21:
కార్తీక మాసం చివరి సోమవారం రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ముక్కంటిశుడిని దర్శించుకున్నారు. నగరంలోని పురాతన స్వయంభూ గుంటు మల్లేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన సతీసమేతంగా సందర్శించారు. తొలుత ఆలయ సిబ్బంది, పాలకవర్గం ఎంపీ దంపతులను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని, అభిషేకం జరిపారు. దర్శనానంతరం రవిచంద్ర దంపతులకు ఆలయ ప్రాంగణంలో వేద ఆశీర్వచనం పలికి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ అభిషేక ప్రియుడైన మల్లేశ్వరుడిని కార్తీక మాసంలో సోమవారం దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి యేటా కార్తీక మాసంలో గుంటు మల్లేషుడిని దర్శించుకోవడం ఆనవాయితీగా పెట్టుకున్నానని, ఆ క్రమంలోనే ఈశ్వరుడి సన్నిధి కి వచ్చానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో చుండూరు రామ కోటేశ్వరరావు, చైర్మన్ గుండు లక్ష్మినారాయణ, కమిటీ సభ్యులు ఆకుల సతీష్, ఆత్మకూరి వెంకటరామారావు తదితరులు పాల్గొన్నారు.
allso read- సీఎం కేసీఆర్ పై తమ్మినేని సంచలన వ్యాఖ్యలు