పార్లమెంటరీ కామర్స్ కమిటీ సభ్యులుగా ఎంపీ నామ
➡️ నామకు పలువురు నేతల అభినందనలు
ఖమ్మం, సెప్టెంబర్ 07(విజయంన్యూస్):
వాణిజ్య శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండ్ కమిటీ సభ్యులుగా బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్ నుంచి అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్‌లోని ప్రొసీజర్, కండక్ట్ ఆఫ్ బిజినెస్ రూల్ 269 లోని సబ్-రూల్ (1) ప్రకారం డిపార్ట్‌మెంట్ ఆఫ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆఫ్ కామర్స్‌లో ఎంపీ నామ నాగేశ్వరరావును సభ్యునిగా నామినేట్ చేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. నామ నాగేశ్వరరావును పార్లమెంటరీ కామర్స్ కమిటీ సభ్యులుగా నియమించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లా కు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు నామకు అభినందనలు తెలిపారు. భవిష్యత్ లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆశీర్వదించి, ఆకాంక్షించారు.
ఇది కూడా చదవండి: ఖమ్మం బీఆర్ఎస్ టార్గెట్ ‘ఆ ఇద్దరే’నా..?