Telugu News

ఎంపీ నామ గొప్ప మానవతావాది

ఖమ్మం పార్లమెంట్ పరిధిలో  57 మందికి మంజూరైన రూ.22,51,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాములునాయక్

0
ఎంపీ నామ గొప్ప మానవతావాది
➡️ పేదలకు నామ వెన్నుముక
➡️ పార్లమెంట్లో తెలంగాణ సత్తా చాటుతున్న నామ
➡️ సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం
➡️ కేసీఆర్ దేశానికి ప్రధాని కావాలి
➡️ ఖమ్మం పార్లమెంట్ పరిధిలో  57 మందికి మంజూరైన రూ.22,51,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాములునాయక్ఖమ్మం, జూన్ 29(విజయంన్యూస్):

 కష్టాల్లో పేదలకు వెన్నుదన్నుగా ఆలంబనగా నిలుస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఎంపీ నామ నాగేశ్వరరావు గొప్ప మానవతావాది అని వైరా శాననసభ్యులు లావుడ్యా రాములు నాయక్ పేర్కొన్నారు. బీఆర్ఎన్ లోక్ సభా పక్ష నాయకులు , ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో వైరా, అశ్వారావుపేట, మధిర, పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాలకు చెందిన 57 మందికి మంజూరైన రూ. 22,51,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను గురువారం ఖమ్మం ఎంపి క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు  ఎమ్మెల్యే నల్లమల, కూరాకుల తో కలసి  అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ మానవత్వం పరిమళించిన గొప్ప నాయకుడు ఎంపీ నామ అని కొనియాడారు.
ప్రజల ఆశీర్వాదంతో మంచి మెజార్టీతో గెలిపించి, పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ సాక్షిగా కడిగిపారేస్తున్నారని అన్నారు. ఎన్నో సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నించి, ఎండగట్టి, తెలంగాణ సత్తా చాటారని అన్నారు. ఒక వైపు ఎంపీగా మరో వైపు నామ ముత్తయ్య ట్రస్ట్ ద్వారా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలతో ప్రజల ప్రేమాభిమానాలు చూరగొన్న ఎంపీ నామకు  రానున్న కాలంలో మరింత అండగా ఉండి, బ్రహ్మాoడమైన మెజార్టీతో గెలిపించు కోవాలన్నారు. కేసీఆర్ నాయకత్వంలో వినూత్న సంక్షేమ పధకాలతో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా  దూసుకుపోతుందన్నారు. 9 ఏళ్ల పాలనలో తెలంగాణాను దేశంలోనే అగ్రగామిగా చేసిన సీఎం కేసీఆర్ రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టడడం ఖాయమని రాములు నాయక్ స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పధకాలు అమలు చేస్తూ తెలంగాణ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ వ్యాప్తంగా ఇనుమడింపజేసిన ఘనత కేసీ ఆర్ కే  దక్కుతుందన్నారు. ఒంటరి మహిళలకు ఫించన్ ఇచ్చి వారి ఆత్మ గౌరవాన్ని మరింతగా పెంచారన్నారు. రైతుబంధు, రైతు బీమా, కంటి వెలుగు పధకాలు ప్రపంచంలో ఎక్కడా అమలులో లేవన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దోపిడీకి గురై, చిక్కి శల్యమైన తెలంగాణాను కేవలం 9 ఏళ్లలోనే కనీవినీ ఎరుగుని రీతిలో అభివృద్ధి చేసిన గొప్ప మహా నాయకుడు కేసీఆర్ అని, ఆయన తెలంగాణా జాతిపిత అని  రాములు నాయక్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి, కేసీఆర్ ను  మూడోసారి సీఎంగా చేసుకుని, మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. మూడోసారి కేసీఆర్ సీఎం కాకపోతే అభివృద్ధి అంతా ఆగిపోతుందని, మళ్ళీ తెలంగాణ వెనుకబడి పోతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్ నాయకత్వంలో అబ్బురపర్చే అభివృద్ధి: నామా

     డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ యావత్ దేశం కేసీఆర్ ను  ప్రధానిగా కోరుకుంటుం దన్నారు. రానున్న ఎన్నికల్లో మూడోసారి కేసీఆర్ కు  పార్టీలకతీతంగా ఓట్లు వేసి, గెలిపించుకోవాలన్నారు. మళ్లీ కేసీఆర్ వస్తేనే అద్భుత అభివృద్ధి జరుగుతుందని, ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగుతాయని  అన్నారు. రాజకీయాలకతీతంగా నామ నాగేశ్వరరావుకు అండగా ఉండి, కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలన్నారు. తొలుత సాయిచంద్ మృతికి సంతాపం తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, ఎంపీ క్యాంప్ కార్యాలయం ఇంచార్జి కనకమేడల సత్యనారాయణ, వైరా జెట్పీటీసీ నంబూరి కనకదుర్గ, పార్టీ వైరా, కొణిజర్ల, బోనకల్ మండల పార్టీ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, చిరంజీవి, చేబ్రోలు మల్లిఖార్జునరావు,టీఏసీ సభ్యులు చిత్తారు సింహాద్రి యాదవ్,  నాయకులు  పోట్ల శ్రీనివాసరావు, చెరుకుమల్లి రవి, మాధవరావు, తన్నీరు రవికుమార్, బంధం శ్రీనివాసరావు, ఉద్దండు, జి. మాధవరావు, మచ్చా బుజ్జి, బత్తుల శ్రీనివాసరావు, డేగల ఉపేందర్, చింతకాని మండలం గాంధీనగర్ సర్పంచ్ కె. లలిత, సోషల్ మీడియా వైరా ఇన్చార్జి ఎన్.నరేశ్ తదితరులు పాల్గొన్నారు.