విశ్వకవి రవీంద్రునికి ఎంపీ నామ ఘన నివాళి
== రవీంద్రుడు గొప్ప దేశ భక్తుడు
== దేశానికి జాతీయ గీతం అందించిన విశ్వకవి
== ఆయన స్ఫూర్తిని భవిష్యత్ తరాలు ముందుకు తీసికెళ్లాలి
== పార్లమెంట్ హాలులో జరిగిన విశ్వకవి రవీంద్రనాధ్ ఠాగూర్ జయంతి వేడుకల్లోలోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా , బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు
న్యూఢిల్లీ / ఖమ్మం, మే 09(విజయంన్యూస్):
భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన విశ్వకవి , నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి రవీంద్రనాధ్ ఠాగూర్ జయంతి వేడుకలు మంగళవారం న్యూఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లాతో పాటు బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు తదితరులు పాల్గొని, రవీంద్రుడికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవీంద్రుని గొప్ప సాహిత్యాన్ని, దేశానికి అందించిన సేవలను కొనియాడారు.
ఇది కూడా చదవండి: సత్తుపల్లి లో దారుణం..ముగ్గురు మృతి
ఆయన రచించిన ‘ జనగణమన ‘ జాతీయ గీతం గురించి మననం చేసుకున్నారు. తన జీవితం ద్వారా ఎంతో మందిని ప్రభావితం చేసి, చైతన్య పర్చిన రవీంద్రుని స్ఫూర్తిని భవిష్యత్ తరాలు ,ముఖ్యంగా యువత మరింత ముందుకు తీసుకుపోవాలని నామ నాగేశ్వరరావు ఈ సందర్భంగా అన్నారు. రచయితగా, సంగీతవేత్తగా, చిత్రకారునిగా, విద్యావేత్తగా, గొప్ప మానవతావాదిగా చరిత్రలో నిలిచిపోయారని నామ అన్నారు. ఆయన గొప్ప తత్వ వేత్త, మత సంస్కర్త అన్నారు.ఆయనకు మాతృ భూమి, మాతృ భాష అంటే అమితమైన అభిమానం అన్నారు. రవీంద్రుని రచనలలో గీతాంజలి రచన చాలా గొప్పదన్నారు. ఇది అనేక భాషల్లోకి అనువ దించబడిందని తెలిపారు. ప్రపంచ సాహిత్యంలోనే ఇది గొప్ప రచనగా కీర్తించబడిందని అన్నారు. రవీంద్రుడు మొదటి నుంచి జాతీయ భావాలున్న గొప్ప దేశభక్తుడని నామ నాగేశ్వరరావు కొనియాడారు. ఈ సందర్భంగా పార్లమెంట్ లైబ్రరీ కాఫీ టేబుల్ బుక్ ను లోక్ సభ స్పీకర్ ఓo బిర్లా విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు,పలు పార్టీలకు చెందిన లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: అన్నింటా తెలంగాణ పట్ల కేంద్రం వివక్షే: నామా