Telugu News

నగరంలో పర్యటించిన ఎంపీ నామనాగేశ్వరరావు.

టీఆర్ఎస్ లోక్ సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు శనివారం ఖమ్మం నగరంలో పర్యటించారు.

0

నగరంలో పర్యటించిన ఎంపీ నామనాగేశ్వరరావు

(ఖమ్మం -విజయం న్యూస్)
టీఆర్ఎస్ లోక్ సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు శనివారం ఖమ్మం నగరంలో పర్యటించారు. రాపర్తినగర్ లోని నవీన గ్రానైట్స్ యజమాని వేముల రవికుమార్ కుమార్తె వివాహాంతో పాటు గృహప్రవేశం ఇటీవల జరిగింది. ఈ నేపథ్యంలో వధువరులను ఆశీర్వదించి, నూతన గృహప్రవేశం చేసుకున్న రవికుమార్ కి శుభాకాంక్షలు. తెలిపారు. వీడియోస్ కాలనీకి చెందిన దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు కుమారుడు సందీప్ ,దుగ్గినేని సురేష్ కుమార్తె లావణ్యల వివాహం ఈనెల 12న నగరంలోని వాసవి గార్డెన్స్ లో జరగనుంది. ఇందులో భాగంగా ముందస్తుగా వధూవరుల ఇళ్లల్లో వేరువేరుగా జరుగుతున్న వివాహా వేడుకలకు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. సుగ్గలవారితోటకు చెందిన సోమా రామారావు తమ్ముడి కుమారుడు వివాహము ఇటీవల జరిగింది.

వారి ఇంటికి వెళ్లి వధూవరులిద్దరినీ ఆశీర్వదించారు. అనంతరం మహాత్మ కొడియార్ (టీవీ 9) స్వరూప (ఆంధ్రప్రభ) దంపతుల కుమార్తె మోక్ష శ్రీకృతి ఓణీల వేడుక సప్తపది పంక్షన్ హాల్లో జరగ్గా వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. అదేవిధంగా ముస్తఫానగర్ కు చెందిన కార్పొరేటర్ మగ్బూల్ అత్తయ్య ఇటీవల అకాల మరణం పొందారు. ఈసందర్భంగా కార్పొరేటర్ మగ్భూల్ తో పాటు వారి కుటుంబసభ్యులను ఎంపీ నామ పరామర్శించారు. పోలీస్ కాలనీలోని అయ్యప్పస్వాముల నిత్యఅన్నదాన సత్రాన్ని ఎంపీ నామ సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. నిర్వాహకుడు హనుమంతరావును అభినందించారు. ఈ కార్యక్రమాల్లో రైతు బంధు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల్ల వెంకటేశ్వరరావు, జిల్లా పార్టీ నాయకులు చిత్తారు సింహాద్రి యాదవ్, జారె ఆదినారాయణ, నామ సేవా సమితి బాధ్యులు రేగళ్ల కృష్ణప్రసాద్, చీకటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

also read :- ఖమ్మంలో గెలిచి చరిత్ర సృష్టించ బోతున్నాం: రాయల