జర్నలిస్ట్ కుటుంబానికి ఎంపీ వద్దిరాజు చేయూత
పాశం వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్ళి పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
జర్నలిస్ట్ కుటుంబానికి ఎంపీ వద్దిరాజు చేయూత
== పాశం వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్ళి పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
== సర్జరీ చేసిన డాక్టర్లకు ఫోన్ చేసి పాశం ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న ఎంపీ
== టియుడబ్ల్యూజె (టీజేఎఫ్) విజ్ఞప్తితో జర్నలిస్ట్ పాశం కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన ఎంపీ వద్దిరాజు..
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన వార్త విలేకరి పాశం వెంకటేశ్వర్లు ను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పరామర్శించారు. శనివారం ఉదయం ఖమ్మం బైపాస్ రోడ్ లోని ఆయన ఇంటికి వెళ్లిన ఎంపీ రవిచంద్ర, పాశం ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీశారు. సర్జరీ తర్వాత ఎలా ఉందని వాకబు చేశారు. టి యు డబ్ల్యూ జే జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ విజ్ఞప్తి మేరకు 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఇది కూడా చదవండి: పాలించడం మనకు చేతకాదా..:ఎమ్మెల్యే కందాళ
యాక్సిడెంట్ అయిన రోజు నుంచి పాశం వెంకటేశ్వర్లు కుటుంబానికి ఆర్దికంగా, మానసికంగా అండగా నిలిచిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రాబోయే రోజుల్లో కూడా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పూర్తిగా కోలుకునే వరకు విశ్రాంతి తీసుకోవాలని, హడావుడిగా వార్తా సేకరణకు వెళ్లవద్దని పాశం వెంకటేశ్వర్లు కు ఎంపీ రవిచంద్ర హితవు చెప్పారు. వెంకటేశ్వర్లకు జరిగిన సర్జరీ చేసిన శ్రీరక్ష హాస్పిటల్ వైద్యులు డా. జీవీ, డాక్టర్ తేజ్ కుమార్లకు ఎంపీ వద్దిరాజు ఫోన్ చేశారు. సర్జరీలో పాశం వెంకటేశ్వర్లకి వేసిన స్టీల్ రాడ్స్ ను ఎప్పుడు తొలగిస్తారు, వాటి లైఫ్ స్పాన్ ఏంటి, తదుపరి చికిత్స తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటని ఆరా తీశారు. పాశం కుటుంబానికి తాను అండగా ఉంటానని చెప్పిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆరోగ్య విషయంలో పూర్తి శ్రద్ధ తీసుకోవాలని డాక్టర్లను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వెంట టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి, ఐజేయు నేషనల్ కౌన్సిల్ సభ్యులు వెన్నబోయిన సాంబశివరావు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, టీజేఎఫ్ ఉపాధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు..
ఇదికూడా చదవండి: ‘సత్తుపల్లి’ లో అక్రమ మట్టి మాఫియా