Telugu News

సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభించిన ఎంపీపీ వరలక్ష్మి

0

సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభించిన ఎంపీపీ వరలక్ష్మి

== హాజరైన జడ్పీటీసీ బాదావత్ బుజ్జి, మండల అధికారులు 

ఏన్కూరు,మే 15 (విజయం న్యూస్ )

సీఎం కప్ 2023 లో భాగంగా మండల స్థాయి క్రీడా పోటీలను సోమవారం స్థానిక గురుకుల పాఠశాలలో ఎంపీపీ ఆరెం వరలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు.

ఇది కూడా చదవండి;- సహాయం చేయండి..సింధును రక్షించండి

క్రీడలు క్రమశిక్షణతో పాటు, ఐక్యమత్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. సోమవారం కబడ్డీ, వాలీబాల్, ఖో-ఖో పోటీలు జరిగాయి. 30 మహిళ, పురుషుల జట్లు మధ్య పోటీలు జరిగాయి. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. మంగళవారం అథ్లెటిక్స్ పోటీలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బాదావత్ బుజ్జి, మండల విద్యాశాఖ అధికారి దుగ్గిరాల జయరాజు, తాసిల్దార్ మహమ్మద్ షా ఖాసీం, ఎంపీడీవో బయ్యారపు అశోక్, ఎస్సై బాదావత్ రవి, సర్పంచులు భూక్య శివ, చిర్రా రుక్మిణి,ఎంపీటీసీ చీరాల కృష్ణవేణి,, పిడి చిన్నబాబు,పి ఈ టి లు రమేష్, శోభన్, రామారావు, శ్రీరాములు, వీరన్న, లక్ష్మణ్, నాగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

ఇది కూడా చదవండి:- కర్టాటక సీఎం ఎంపిక నిర్ణయం హైకమాండ్ దే