Telugu News

బండా ప్రకాష్ గారికి ఎంపీ ల వీడ్కోలు. *********

తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ఇప్పటివరకు రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ గారిని ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.

0

బండా ప్రకాష్ గారికి ఎంపీ ల వీడ్కోలు. *********

(తెలంగాణ – విజయం న్యూస్)

తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ఇప్పటివరకు రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ గారిని ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.

రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన కొద్దికాలంలోనే దేశ, రాష్ట్ర ప్రజల అభ్యున్నతి దృష్టిలో ఉంచుకుని అనేక నిర్మాణాత్మకమైన ప్రశ్నలు అడిగి గుర్తింపు తెచ్చుకున్నారని ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యులుగా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడమే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాలలో తీసుకురావాల్సిన మార్పులపై తనదైన శైలి మాట్లాడాలని అన్నారు.

ఎమ్మెల్సీగా ఎన్నికయిన బండా ప్రకాష్ ముదిరాజుకు బండా ప్రకాష్ కు ఎంపిగా పదవికి రాజీనామ చేయడంతో న్యూఢిల్లీలో సహచర పార్లమెంట్ మరియు రాజ్యసభ సభ్యులు కలిసి వీడ్కోలు పలకడం జరిగింది.

ఈ కార్యక్రమంలో లోక్‌సభ, రాజ్యసభ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్లు నామా నాగేశ్వరరావు, కె కేశవరావు, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత, వరంగల్ పార్లమెంటు సభ్యులు దయాకర్, రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్ పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది.

 

also read :- జెన్సీ లో హై ఆలర్ట్ మావోయిస్టుల వారోత్సవాలు నేపథ్యంలో డిజిపి మహేందర్ రెడ్డి పర్యాటన

also read :-విద్యా సంస్థల బస్సుల తనిఖీ – ఫిట్‌ నెస్‌ లేకుండా తిరుగుతున్న నాలుగు బస్సులను సీజ్‌