Telugu News

కన్నీంటి పర్వంతమైన ఎమ్మెల్యే కందాళ

గడ్డం సత్యం కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ కన్నీటి పర్యంతమైన ఎమ్మెల్యే == నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన

0

కన్నీంటి పర్వంతమైన ఎమ్మెల్యే కందాళ
== గడ్డం సత్యం కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ కన్నీటి పర్యంతమైన ఎమ్మెల్యే
== నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన

(కూసుమంచి – విజయంన్యూస్)
నేలకొండపల్లి మండలంలోని పైనంపల్లి గ్రామంలో ఇటీవల బైక్ రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన గడ్డం సత్యం చిత్రపటానికి పూలమాలవేసిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అకస్మీకంగా కన్నీంటి పర్వంతమైయ్యారు. ఆయన తన ఎన్నికల్లో పనిచేసిన తీరును గుర్తు చేసుకున్నారు. ఆయనకు నమ్మిన బంటువుగా ఉన్నారని, ఆయన ఎంతగానో నా కోసం పరితపించేవారని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. సత్యం కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటారని కన్నీళ్లతో నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటానని హామినిచ్చారు. ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వున్నం బ్రహ్మయ్య టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు హాజరైయ్యారు.


== మల్లీడు శెంకన్నను పరామర్శించిన ఎమ్మెల్యే కందాళ
కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామంలో మండల నాయకులు మల్లీడు వెంకన్నను పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల బైక్ మీద నుంచి ప్రమాదవశాత్తు క్రింద పడి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఆయన వెంకన్న స్వగృహనికి వెళ్లి వారి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామ శాఖ అధ్యక్షులు రెంటాల ఆనంద్ అమ్మ పుష్పమ్మ మరణించిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పుష్పమ్మ పార్థివదేహానికి పూలమాలలువేసి,నివాళులర్పించి,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపి,వారి కుమారుడు ఆనంద్ ని ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించారు. అనంతరం ఖమ్మం రూరల్ మండలం పెద్దతండా గ్రామ పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మ కాలనిలో నూతనంగా నిర్మించనున్న సి.సి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తీర్ధాల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిసి కెమారాలను ప్రారంభించి, పరివేక్షించారు. అనంతరం శ్రీ సంఘమేశ్వర స్వామి దేవస్థానం నందు శివరాత్రి జాతర సందర్భంగా జరిగే షాపుల వేలం కార్యక్రమంలో పాల్గొన్ని,జాతరకు సంబంధించిన ఏర్పాట్ల గురించి మాట్లాడారు.

also read :- తగరం సందీప్ కుమార్ కు జాతీయ స్థాయి అవార్డు
== నేలకొండపల్లిలో
అనంతరం ఇటీవల మరణించిన నునావత్ సాయి సాకేత్ ,దాసగాని ఉపేందర్,కట్టా భాగ్యమ్మ కుటుంబాలను పరామర్శించి,ఈమూడు కుటుంబాల సభ్యులకు రూ.10వేల చొప్పున ఆర్ధిక సహాయాన్ని అందించారు. అనంతరం ఇటీవల మరణించిన గుగులోత్ మోతీ కుటుంబాన్ని పరామర్శించి రూ. 10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం చెన్నారంలో ఇటీవల మరణించిన పగడాల సందీప్ ,యడపెల్లి నర్సింహారావు కుటుంబాలను పరామర్శించి రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మండ్రాజుపల్లిలో అనంతరం ఇటీవల మరణించిన గుండు వెంకన్న,షేక్ జాన్ బీ కుటుంబాలకు రూ.10,000 చొప్పున ఆర్ధిక సహాయాన్ని అందజేశారు.
== ఇంటింటికి కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి,షాదీముబారక్ పథకంలో భాగాంగా లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గురువారం ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందజేశారు. నేలకొండపల్లి మండలం మోటాపురం గ్రామంలో కళ్యాణాలక్మి,షాదీముబారక్ 2 చెక్కులను వారి ఇంటి వద్దకి వెళ్లి స్వయంగా లబ్దిదారులకు పంపిణీ చేశారు. నేలకొండపల్లి మండలం శంకరగిరి తండా గ్రామంలో కళ్యాణాలక్మి,షాదీముబారక్-2 చెక్కులను,వివిధ ఆసుపత్రిలో చికిత్సల అనంతరం దరఖాస్తు చేసుకుని మంజూరైన ఒక్క సీఎంరిలీఫ్ పండ్ చెక్కుకు గాను రూ. 40,000 విలువైన చెక్కులను వారి ఇంటి వద్దకి వెళ్లి స్వయంగా లబ్దిదారులకు పంపిణీ చేశారు. రాజేశ్వపురం గ్రామ పంచాయతీలో కళ్యాణాలక్మి,షాదీముబారక్-7 చెక్కులను,వివిధ ఆసుపత్రిలో చికిత్సల అనంతరం దరఖాస్తు చేసుకుని మంజూరైన ఒక్క సీఎంఆర్ఎఫ్ చెక్కుకు గాను రూ.30,500 విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. చెన్నారం గ్రామంలో కళ్యాణాలక్మి,షాదీముబారక్-3 చెక్కులను లబ్దిదారులకు అందజేశారు.

also read :- ఉరి వేసుకొని ఒకరి ఆత్మహత్య..

మండ్రాజ్ పల్లి గ్రామంలో కళ్యాణాలక్మి,షాదీముబారక్-2 చెక్కులను, బోదులబండ,రామచంద్రపురం గ్రామంలో కళ్యాణాలక్మి,షాదీముబారక్-8 చెక్కులను, అమ్మగూడెం గ్రామంలో కళ్యాణాలక్మి,షాదీముబారక్-2 చెక్కులను లబ్దిదారులకు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ బెల్లం ఉమా, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణు, వున్నం బ్రహ్మయ్య , కార్యదర్శి వెన్నబోయిన శ్రీను, సిడిసి చైర్మన్ నెల్లూరి లీలా ప్రసాద్, డిసిఎంస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు, రైతు బందు మండల కన్వీనర్ శాఖమూరి సతీష్, నేలకొండపల్లి సొసైటీ చైర్మన్ కోటి సైదారెడ్డి, అమ్మగూడెం సర్పంచ్ గండు సతీష్, డిసిసిబి మాజీ డైరెక్టర్ నంబూరి సత్యనారాయణ, అనగాని నర్సింహారావు, టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు మాదాసు ఆదాం వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

also read :- వైన్స్ షాప్ నిర్వాహకుల ఇష్టారాజ్యం.. హెచ్చు ధరలతో విక్రయాలు.