Telugu News

ఆసుపత్రిలో పసికందు మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమా..?

కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు

0

సర్కార్ దవాఖానాలో పసికందు మృతి.
— ఏటూరునాగారం పీహెచ్సీలో విషాదం

— కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు

(ములుగు – విజయంన్యూస్)

ములుగు జిల్లా ఏటూరునాగారంలో ప్రభుత్వ ఆసుపత్రి విషాదం నెలకొంది. వాజేడుకు చెందిన కృష్ణ మూడు రోజుల క్రితం తన భార్య కుమారికి పురిటి నొప్పులు రావడంతో ఏటూరునాగారంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. చేర్చిన రోజే నొప్పులు అధికం కావడంతో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ వైద్యులు ఆపరేషన్ చేయగా కుమారి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రెండురోజుల పాటు నిలకడగా ఉన్న పాప ఆరోగ్యం సోమవారం ఉదయం విషమించింది.శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతోందని పాప అమ్మమ్మ వైద్యులకు తెలుపడంతో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్ రాహుల్ చికిత్స చేస్తుడంగా అప్పటికే పాప ప్రాణం పోయింది. ఈ ఘటనలో పాప మృతికి కారణాలేంటని ఆపరేషన్ చేసిన డాక్టర్ ను వివరణ కోరగా తనకేమీ తెలియదని, ఏమి చెప్పలేనంటూ సూపరింటెండెంట్‌ను అడగండి అంటూ అక్కడ నుంచి జారుకున్నాడు. తమ బిడ్డ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు.ప్రసూతి వైద్య నిపుణులు అందుబాటులో లేకపోవడంతో ఎంబీబీఎస్ వైద్యులే డెలివరీ చేయడం నిపుణుల పర్యవేక్షణ లేకపోవడంతో తాము పాపను కోల్పోయామంటూ కన్నీరు పెట్టుకున్నారు.

ALSO READ :- చత్తీస్ ఘడ్ లో ఎన్ కౌంటర్

*‘ఎప్పటికప్పుడు లెటెస్ట్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? దేశంలో, రాష్ర్టంలో జరిగే తాజా బ్రేకింగ్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? అయితే మా విజయం పేపర్ ను సబ్ స్కైబ్ చేసుకొండి.. మీ స్ర్కీన్ పై ఉన్న గంట గుర్తును నొక్కండి.. ఆ తరువాత ఎలో అని నొక్కండి.. మినిట్ టూ మినిట్ బ్రెకింగ్ న్యూస్ మీ ముంగిట’*🔔*