Telugu News

ముదిగొండ లో సాగర్ కాలువలో ముగ్గురు గల్లంతు

బహిర్భూమికి పోయి కాలువలో జారీపడిన ఓ వ్యక్తి

0

ముదిగొండ మండలంలో సాగర్ కాలువలో ముగ్గురు గల్లంతు

** బహిర్భూమికి పోయి కాలువలో జారీపడిన ఓ వ్యక్తి

** ఆయనను కాపాడబోయి మరో ఇద్దరు కాలువలో పడి గల్లంతు

** ముగ్గురు పంజాబ్ వాసులే

** అచూకి కోసం గాలిస్తున్న పోలీసులు

(ముదిగొండ-విజయం న్యూస్)

ముదిగొండ మండలం కట్టకూరు వద్ద సాగర్ కాలవలో పడి ముగ్గురు గల్లంతైన సంఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పంజాబ్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు వరికోత మిషన్ తో వరి పొలాలను కోసేందుకు గ్రామానికి వచ్చారు. రోజులాగే పనులు చేసుకుంటున్న వారు.. పొద్దుగల పంజాబీలు బహిర్భూమికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు ఒకరు సాగర్ కాలవలో జారి పడటంతో ఒకరిని ఒకరు కాపాడబోయి ముగ్గురు కాలువ లో పడి గల్లంతైయ్యారు.

allso read :- శంకరంపల్లి లో పులి సంచారం…!!

తెల్లవారుజామున కావడంతో వారిని కాపాడేందుకు ఎవరు కాలువ వద్ద లేరు. స్థానికుల
సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని యన్ ఎస్ పి అధికారులతో మాట్లాడారు. దీంతో స్పందించిన అధికారులు సాగర్ కాలువ నీటి ప్రవహాన్ని తగ్గించారు. పోలీసులు, గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన ముగ్గురు పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు.వారిలో మనీ (28), సాజన్ (18), గమ(30) ఉన్నారు. వారి కుటుంబ సభ్యులకు పోలీసులు పోన్ ద్వారా సమాచారం అందించారు.