Telugu News

వల్లభిలో హత్య

లిప్ట్ అడిగి.. ఇంజక్షన్ ఇచ్చి.. విచిత్రంగా జరిగిన హత్య

0

వల్లభిలో హత్య

== లిప్ట్ అడిగి.. ఇంజక్షన్ ఇచ్చి.. విచిత్రంగా జరిగిన హత్య

== అక్కడిక్కడే చనిపోయిన షేక్ జమాల్ సాహెబ్

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

వల్లభిలో హత్య జరిగింది.. బిడ్డ వద్దకు వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తి హత్యచేసి పరారైయ్యాడు.. ఆ హత్య చాలా విచిత్రంగా జరిగింది.. ఎలా జరిగిందనుకుంటున్నారా..? స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

allso read- చిన్నారి మేఘన అదృశ్యంపై వీడని మిస్టరీ……? 

ఖమ్మం జిల్లా, మధిర నియోజకవర్గం, ముదిగొండ మండలం బొప్పారం గ్రామానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్(55) వ్యవసాయం సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. తన కూతుర్ని ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని గండ్రాయి గ్రామానికి ఇవ్వగా, ఆయన తన మోటర్ సైకిల్ పై వల్లబి మీదగా గండ్రాయి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ ఇవ్వమని అడగ్గా, ఆయన తమ మోటర్ సైకిల్ ఆపి ఎక్కించుకున్నాడు. అప్పటికే మంకి క్యాఫ్ పెట్టుకున్న ఆ గుర్తు తెలియని నిందితుడు బాణాపురం దాటి తరువాత వల్లబి సమీపంలో మోటర్ సైకిల్ పై ఉన్నఆ వ్యక్తి వెనక నుంచి ఇంజక్షన్ ఇచ్చి మరో మోటర్ సైకిల్ పై పరారైనట్లుగా పలువురు స్థానికులు చెబుతున్నారు. అయితే జమాల్ సాహెబ్ కొంచం దూరం పోయిన తరువాత మోటర్ సైకిల్ పై కిందపడి అక్కడిక్కడే చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న ముదిగొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ధర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.