Telugu News

‘ఇంజక్షన్’ హత్య లో పెద్ద ట్విస్ట్

జమాల్ సాహెబ్ హత్యలో  భార్య పాత్ర..!

0

‘ఇంజక్షన్’ హత్య లో పెద్ద ట్విస్ట్

== జమాల్ సాహెబ్ హత్యలో  భార్య పాత్ర..?

== పోలీసుల అదుపులో మృతుని భార్య..

== గత రాత్రి పొద్దుపోయాక మృతుని భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

== వివాహేతర సంబంధమే హత్యకు కారణం..?

==  పోలీసుల అదుపులో ఆర్ఎంపీ వైద్యుడు, ట్రాక్టర్, ఆటో డ్రైవర్లు కూడా..!?

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

“ఇంజక్షన్ హత్య”లో భారీ ట్విస్ట్ బయటపడింది.. జమాల్ సాహెబ్ హత్యలో కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.. ఈ మేరకు మృతుని భార్య పోలీసుల అదుపులో తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.. అక్రమసంబందం కోసమే భర్తను భార్య హత్య చేయించినట్లుగా ప్రచారం జరుగుతోంది.. ఆమెను ప్రేమించిన ప్రియుడు వారి స్వేచ్ఛకు భగం కలుగుతుండటంతో హత్యకు ప్లాన్ చేసినట్లుగా సమాచారం.

allso read- సూదిగాళ్ళు చిక్కారా..?

సుమారు నెల రోజుల నుంచి ఈ హత్యప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. ప్రియుడు, ప్రియురాలు ఇద్దరు కలిసి ఈ ప్లాన్ చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్ ను ముదిగొండ మండలం బాణాపురం-వల్లభి గ్రామాల నడుమ పంట పోలాల సమీపంలో ఇంజక్షన్ ఇచ్చి హత్య చేసిన సంగతి తెలిసిందే.. ఈ విషయంపై  ఏసీపీ బస్వారెడ్డి ఆధ్వర్యలో నాలుగు పోలీసు బృంధాలు ధర్యాప్తు చేపట్టగా కుటుంబ సభ్యులపై అనుమానం వచ్చి వారి కదలికలపై ద్రుష్టి సారించారు. ఈ క్రమంలో సెల్ పోన్ నెంబర్ ద్వారా, సీసీ కెమోరాల పుటేజీల ద్వారా అసలు నిందితులను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. దీంతో నామారం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ గోదా మోహన్ రావు, ట్రాక్టర్ డ్రైవర్ నర్సింశెట్టి వెంకటేశ్వర్లు, ఖమ్మంకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు బండి వెంకటేశ్వర్లు ఈ హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానించి వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఇప్పటికే ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తున్నప్పటికి ఆర్ఎంపీ వైద్యుడు పరారిలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ కేసుపై సమగ్రంగా విచారణ చేసిన పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే నిజం తెలిసింది.. దీంతో హత్యగావించబడిన జమాల్ సాహెబ్ హత్యలో ఆయన కుటుంబ సభ్యుల పాత్ర ఉందని పోలీసులు నిర్థారణకు వచ్చినట్లు సమాచారం. దీంతో  మంగళవారం అర్థరాత్రి సమయంలో ఆయన కుటుంబ సభ్యులను కూడ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం..

== భార్య హత్య చేయించిందా..?

జమాల్ సాహెబ్ బొప్పారం గ్రామంలో వ్యవసాయం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన భార్య వ్యవసాయకూలీగా పనిచేస్తుంది. అయితే నామారం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మోహన్ రావుతో అక్రమ సంబంధం ఏర్పడినట్లు సమాచారం.

allso read- వల్లభిలో హత్య

ఈ క్రమంలో భర్త కొద్ది రోజులుగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. తీరు మార్చుకోవాల్సిన లేటు వయస్సు ప్రేమికులు వివాహేతర సంబంధంను కొనసాగిస్తూ వారి బంధానికి అడ్డంగా ఉన్న భర్తను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో మోహన్ రావు తన స్నేహితుడైన ట్రాక్టర్ డ్రైవర్ ను నర్సింశెట్టి వెంకటేశ్వర్లు కు విషయం చెప్పి ఆయన సహాయంతో ఆర్ఎంపీ వైద్యుడు బండి వెంకటేశ్వర్లు తో సుఫారి మాట్లాడుకున్నారు. ఈ  క్రమంలో హత్యకు ప్లాన్ చేసిన ఆర్ఎంపీ వైద్యుడు  సోమవారం ఉదయం ముగ్గురు పక్కా ప్లాన్ చేసి జమాల్ సాహెబ్ ఊరికి వెళ్తున్న సంగతి ఆయన భార్య ద్వారా సమాచారం తెలుసుకున్నారు. దీంతో ఏం చేయాలనే విషయంపై పక్కా ప్లాన్ చేసుకుని బాణాపురం సమీపంలో లిప్ట్ అడిగి ఇంజక్షన్ ఇచ్చి హత్య చేశారు. ఈ విషయాన్ని తన భార్యకు ప్రియుడు పోన్ ద్వారా సమాచారం అందించినట్లు కూడా తెలుస్తోంది. అయితే అసలు నిందితులను గుర్తించిన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేయగా భార్య పాత్ర ఉందని భావించి గత రాత్రి పొద్దుపోయాక మృతుని భార్యను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా జమాల్ సాహెబ్ హత్య కేసులో మొత్తం నలుగురు నిందితులుగా గుర్తించిన పోలీసులు ఆ నలుగుర్ని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు పోలీసుల నుంచి అధికారిక సమాచారం అందలేదు.. నిందితులను గుర్తించే పనిలో ఉన్నామని ఏసీపీ బస్వారెడ్డి తెలిపారు.

allso read- మొదటి టీ20లో ఓడిన భారత్