Telugu News

సూదిగాళ్లు ‘ఆ నలుగురే’ : ఏసీపీ

ప్రియుడితో సుఖం కోసం భర్తను కడతెర్చిన భార్య

0

సూదిగాళ్లు ‘ఆ నలుగురే’ : ఏసీపీ

== ప్రియుడితో సుఖం కోసం భర్తను కడతెర్చిన భార్య

== ప్రియుడితో కలిసి హత్యకు ప్లాన్

== హత్య చేసిన ఆర్ఎంపీ, ట్రాక్టర్ డ్రైవర్

== సహాకరించిన మరో ఇద్దరు

== ఆరుగురిపై కేసు నమోదు.. అరెస్టు..

== ప్రియుడి కోసం భర్తను చంపించిన భార్య

== పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు

== విలేకర్ల సమావేశంలో వివరాలు వెళ్లడించిన ఏసీడీ బస్వారెడ్డి

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

వివాహేతర సంబంధమే ఇంజక్షన్ హత్య” కారణమని ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి తెలిపారు. జమాల్ సాహెబ్ హత్యలో మృతుని భార్య, ఆమె ప్రియుడు కలిసి హత్యకు ప్లాన్ చేశారని, మరో ఇద్దరు హత్య చేయగా, మరో ఇద్దరు సహాకరించారని తెలిపారు.  సోమవారం వల్లభి వద్ద జరిగిన ఇంజక్షన్ హత్య విషయంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించి పట్టుకుని అరెస్టు చేశారు. ఈ మేరకు బుధవారం ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో  ఏసీపీ బస్వారెడ్డి వివరాలను వెల్లడించారు.

allso read- నేలకొండపల్లి ఎస్ఐ కు కుల అహంకారం ఉంది: మంద కృష్ణ మాదిగ

ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్ ను ముదిగొండ మండలం బాణాపురం-వల్లభి గ్రామాల నడుమ పంట పోలాల సమీపంలో ఇంజక్షన్ ఇచ్చి హత్య చేసిన సంగతి తెలిసిందేని అన్నారు.  ఈ విషయంపై  ఏసీపీ బస్వారెడ్డి ఆధ్వర్యలో నాలుగు పోలీసు బృంధాలు ధర్యాప్తు చేపట్టగా కుటుంబ సభ్యులపై అనుమానం వచ్చి వారి కదలికలపై ద్రుష్టి సారించామని తెలిపారు. ఈ క్రమంలో సెల్ పోన్ నెంబర్ ద్వారా, సీసీ కెమోరాల పుటేజీల ద్వారా అసలు నిందితులను గుర్తించామని తెలిపారు.  

== అడ్డు తొలిగించుకునేందుకే భర్తను హత్యకు ప్లాన్ చేసిన భార్య

జమాల్ సాహెబ్ బొప్పారం గ్రామంలో వ్యవసాయం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని, ఆయన భార్య షేక్ ఇమాంబీ వ్యవసాయకూలీగా పనిచేస్తుందని, ఈ క్రమంలో నామారం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మోహన్ రావుతో వివాహేతర సంబంధం ఏర్పడినట్లు ఏసీపీ బస్వారెడ్డి తెలిపారు. ఈ క్రమంలో భర్త కొద్ది రోజులుగా హెచ్చరిస్తుండగా,  తీరు మార్చుకోవాల్సిన ఆమె వారి బంధానికి అడ్డంగా ఉన్న భర్తను హత్య చేయాలని నిర్ణయించుకుందని అన్నారు.  దీంతో భార్య షేక్ ఇమాంబీ, ఆమె ప్రియుడు మోహన్ రావు హత్యకు ప్లాన్ చేశారని తెలిపారు.

allso read- భద్రాద్రి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

మోహన్ రావు తన స్నేహితుడైన ట్రాక్టర్ డ్రైవర్ ను నర్సింశెట్టి వెంకటేశ్వర్లు కు విషయం చెప్పి ఆయన సహాయంతో నామారం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు బండి వెంకన్నను సంప్రదించారని, తన ప్రేమాయణం మొత్తం చెప్పి మనిషి చనిపోయే ఇంజక్షన్ కావాలని అడిగారని తెలిపారు. దీంతో రూ.5000 ఇస్తే ఇంజక్షన్ ఇస్తానని చెప్పడంతో మోహన్ రావు అప్పటికప్పుడు రూ.3,500 ఇచ్చాడని, దీంతో ఆర్ఎంపీ వైద్యుడు ఖమ్మం నగరంలోని తన స్నేహితుడైన పుట్టకోట గ్రామానికి చెందిన యశ్వంత్,  ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, ఆరాధ్య అత్యవసర ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడని ఏసీపీ తెలిపారు. ఆయన సహాయంతో బోనకల్ మండలం, రాయన్నపేటకు చెందిన  పొరలా సాంబశివ రావుకు విషయం చెప్పి అతని దగ్గర ఉన్న నీయోవిక్ఇంజెక్షన్లను రెండు తెప్పించుకున్న బండి వెంకన్నఆ  రెండు ఇంజెక్షన్లను మోహన్ రావుకు ఇవ్వడం జరిగిందన్నారు. ఇటి విషయం బండి వెంకన్న, వెంకటేష్ తో చర్చించి, అటి ఇంజెక్షనను వెంకటేష్ ద్వారా వాటిని మృతుడికి వెయ్యమని ఇమాంబీ కి పంపాడని,  ఇమాంబీ ప్రయత్నం చేసిన ఫలితం లేకపోవడంతో ఇంజెక్షను తీసుకెళ్లమని గోదా మోహన్ రావు తో  జమాల్ సాహెబ్ భార్య చెప్పింది. దీంతో ఆయన ఇంజక్షన్లను తీసుకొని  నర్సింశెటి వెంకటేష్ అనే నేరస్తుడి ద్వారా ఇమాంబీ నుండి తెప్పించుకున్నాడని తెలిపారు.  ఈనెల 19న  నేరసురాలైన ఇమాంబీ తన భర్త గండ్రాయి వస్తున్నాడని తన ప్రియుడైన గోదా మోహన్ రావు కి ఫోన్ ద్వారా తెలియపరచి, ఈ రోజు ఎలాగైనా పని పూర్తి చేయాలనీ ఆదేశించింది. దీంతో గోదా మోహన్ రావు, బండి వెంకన్న, వెంకటేష్ ని తీసుకొని రెండు మోటారు సైకిల్ పై వల్లభి వెళ్లి మృతుడు తన మోటారు సైకిల్ పై గండ్రాయి వెళ్తుండగా లిఫ్ట్ అడిగి బైక్ ఎక్కిన తరువాత ఇంజక్షన్ వేసి వెంటనే పారిపోయారని ఏసీపీ తెలిపారు.  

allso raed- ‘ఇంజక్షన్’ హత్య లో పెద్ద ట్విస్ట్   

 

ఇంజక్షన్ ప్రభావం వలన మృతుడు వల్లభి హాస్పిటల్ కి తీసుకువెళ్లే లోపే మరణించినాడని తెలిపారు.  కేవలం తమ అక్రమ సంబంధానికి అడుగా వున్నాడని ఇమాంబ్, గోదా మోహన్ రావులు హత్యకు ప్లాన్ చేయగా, ఆర్ఎంపీ బండి వెంకన్న, వెంకటేష్ లు హత్య చేశారని, వారికి యశ్వంత్, సాంబశివరావులు సహాకరించారని తెలిపారు.

== పోలీసులను అభినందించిన ఏసీపీ

ముదిగొండ మండలంలోని వల్లభి సమీపంలో జరిగిన హత్య విషయంలో తన ఆధ్వర్యంలో ఖమ్మం రూరల్ సీఐ శ్రీనివాస్ రావు, ఎస్ఐ నాగరాజు ప్రత్యేక చొరవ తీసుకుని మరో ఇద్దరు ఎస్ఐలతో నాలుగు బ్రుందాలుగా ఏర్పడి విచారణ చేశారని తెలిపారు. 24గంటల్లో వారిని పట్టుకుని అరెస్టు చేసిన సీఐ, ఎస్ఐలను, సిబ్బందిని అభినందించారు. వారిని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ నలుగురితోపాటు విష రసాయనం విక్రయించిన ఖమ్మంకు చెందిన ఓ మందుల దుకాణం వ్యాపారిని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఎనస్తీషియాకు ఇచ్చే రసాయనం అధిక మోతాదులో ఇవ్వడం, అది కూడా వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. సంచలనం రేపడంతో పాటు అందరినీ భయభ్రాంతులకు గురిచేసిన ఈ హత్య కేసును 48 గంటల్లోనే చేధించిన పోలీసులపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

allso read- పిల్లల ప్రాణాలతో చెలగాటం..!

==  ఐదు కుటుంబాలకు తీరని వేధన..
ఒక్క హత్య ఘటన మొత్తం ఐదు కుటంబాలకు తీరని వేదన మిగిలించింది. అనైతిక బంధం మోజులో భర్తను పోగొట్టుకున్న భార్య దిక్కులేనిదైంది. దీంతో పాటు కటకటాల పాలైంది. తనకంటూ కుటుంబం భార్యా పిల్లలతో హాయిగా ఉన్న మరో నలుగురి కుటుంబాలకు కష్టాలు తప్పడం లేదు. ప్రియురాలి మోజులో పడి మోహన్ రావు ఈ హత్య కేసులో ప్రధాన పాత్రదారిగా మారగా.. అసలు సంబంధంలేని డ్రైవర్ వెంకటేశ్, ఆర్ఎంపీ వైద్యుడు వెంకట్, మత్తు మందు విక్రయించిన మరో వ్యక్తి కటకటాల పాలు కావాల్సి వచ్చింది.