Telugu News

బోల్తా పడిన ట్రాక్టర్.. మహిళ మృతి..20మందికి గాయాలు

ముదిగొండ మండలం వల్లభిలో ఘటన

0

బోల్తా పడిన ట్రాక్టర్.. మహిళ మృతి..20మందికి గాయాలు

ముదిగొండ మండలంలో ఘటన

కేసు నమోదు చేసిన ముదిగొండ పోలీసులు

(ముదిగొండ-విజయం న్యూస్)

ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలంలో కూలీలతో వెళ్తున్న  ట్రాక్టర్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తాపడింది.. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, 20మంది గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే  నేలకొండపల్లి మండలం మంగాపురం తండా నుంచి వల్లబి పత్తి తీచేసేందు  ముదిగొండ మండలం వల్లబి వైపు వెళ్తున్నారు. ప్రతి రోజు కూలీ పనులకు వెళ్తుంటారు.కాగా బుధవారం రోజున కూడా అలాగే వెళ్తుండగా  వల్లభి శివారున  కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో ఓ మహిళ మృతి చెందగా 20మందికి  గాయాలైయ్యాయి.. స్థానికులు తక్షణమే స్పందించి  ఆసుపత్రికి తరలించారు.  సమాచారం అందుకున్న ముదిగొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

also read :- కన్నతండ్రి పైశాచికం ..! మూడవ బిడ్డపుట్టిందని చంపేసిన తండ్రి