Telugu News

గొయ్యికి సాక్ష్యం గులాబీ జెండా..

** జాతీయ రహధారి నడిరోడ్డపై ఏర్పడిన గొయ్యి

0

గొయ్యికి సాక్ష్యం గులాబీ జెండా..

** జాతీయ రహధారి నడిరోడ్డపై ఏర్పడిన గొయ్యి

** అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం

(ములుగు -విజయం న్యూస్)

ఏటూరునగర్ నుండి మణుగూరు వెళ్లే జాతీయ రహదారి 163 మంగపేట మండలం, వాడగూడెం గ్రామ పంచాయతీ దగ్గర సుమారు నాలుగు అడుగుల లోతుతో, రెండున్నర అడుగుల వెడల్పుతో పెద్ద గొయ్యి ఏర్పడింది.నిత్యం వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతూ రద్దీగా ఉండే ఈ రహదారిపై గుంత ఏర్పడి పక్షం రోజులు అయింది. ఈ జాతీయ రహదారి 163 పై గొయ్యి ఏర్పడినప్పటికి ఆర్ అండ్ బి కి సంబంధించిన అధికారులు ప్రధాన రహదారిపై ఏర్పడిన గొయ్యిని గుర్తించి పూడ్చక పోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ప్రమాదకరంగా ఉన్న గొయ్యిలో వాడగూడెం గ్రామస్తులు బాధ్యత గల పౌరులుగా టీఆర్ఎస్ జెండాను, ఖాళీ సంచితో ప్రమాద సూచిక ఏర్పాటు చేశారు.ఇప్పటికైనా జాతీయ రహదారి సంబంధిత అధికారులు స్పందించి అతి ప్రమాదకరంగా ఉన్న గొయ్యిని పూడ్చి వేసి ప్రమాదాలు జరగకుండా నివారించవలసిన బాధ్యత ఉన్నదని వాహనదారులు కోరుతున్నారు.

Also read :- పీసీసీ పదవికి సిద్దూ రాజీనామా.