కూలీన ఇళ్ళు.. వృద్ధురాలుకు తృట్టిలో తప్పిన పెను ప్రమాదం
★★ స్వల్ప గాయాలతో బయటపడ్డ లక్ష్మి కుటుంబం..
ములుగు జిల్లా ప్రతినిధి జులై 8 (విజయం న్యూస్):- వర్షాకాలం మొదలయ్యి ఎడతెడప లేకుండా గురువారం రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి మంగపేట మండలం,రమణక్కపేట గ్రామం, ఎస్సీ కాలనీలో నివసిస్తున్న పూస లక్ష్మి ఇల్లు శుక్రవారం ఉదయం కూలిపోయింది.
Allso read:- వర్షాకాలం…వ్యాధులకాలం…జాగ్రత్త సుమా
ఇల్లు కూలిన సమయంలో వారు ఇంటి లోపల ఇరుక్కుపోయారు. లోపలి నుండి బిగ్గరగా కేకలు వేస్తుంటే చుట్టుపక్కల ఉన్నవారు కొంతమంది విని చూడగా వారు ఇంటి లోపల ఇరుక్కుపోవడం గమనించి హుటా హుటిన వచ్చి వారిని క్షేమంగా బయటికి తీయడం జరిగింది. వర్షాకాలం కావడంతో నివాసం కోల్పోయిన బాధితరాలు ఇప్పుడు ఎక్కడికి పోవాలి ఎక్కడ ఉండాలి అని కన్నీరు మున్నీరవుతున్నారు. ఇల్లు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధితురాలిని ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని బాధితురాలతో పాటు గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు.
Allso read:- వైరా ‘కారు’పార్టీలో కుంపటి