Telugu News

పాదయాత్ర లో డప్పు దరువేసిన సీతక్క

పాదయాత్ర నిర్వహించిన సీతక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

0

పాదయాత్ర లో డప్పు దరువేసిన సీతక్క

== ఇంటింటి తిరిగి ప్రచారం చేస్తున్న సీతక్క

== దేశాన్ని ఏకం చెయ్యడమే రాహుల్ గాంధీ జోడో యాత్ర ముఖ్య ఉద్దేశం*…

== దేశాన్ని విచ్ఛిన్నం చెయ్యడమే బిజెపి లక్ష్యం*…

== మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్న బిజెపి కి దేశ ప్రజలు బుద్ది చెప్పాలి* …

== ఈ నెల 23 న రాహుల్ గాంధీ తెలంగాణ కు రాబోతున్నారు*

== ములుగు నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలి*

== కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క*

== రాహుల్ గాంధీ  జోడో యాత్ర కు సంఘీభావంగా పాదయాత్ర నిర్వహించిన సీతక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణులు*……

తాడ్వాయి అక్టోబర్ 21 (విజయం న్యూస్):-

ములుగు జిల్లా కేంద్రములో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సన్నాహక సమావేశం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి ఆధ్వర్యములో నిర్వహించగా
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కు సంఘీభావంగా పాదయాత్ర నిర్వహించిన సీతక్క అనంతరం మాట్లాడుతూ

Allso read:- వన దేవతల ను దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి సతీమణి.
అక్టోబర్ 23 నుంచి తెలంగాణలో జరిగే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర విజయవంతం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కంకణ బద్ధులై పని చేయాలి
తెలంగాణలో ప్రతి గడప నుంచి ఈ యాత్రలో పాల్గొనే విధంగా పార్టీ శ్రేణులు చొరవ చూపాలి
బిజెపి పాలనలో దేశంలో పెరుగుతున్న రాజకీయ ఆర్థిక అసమానతలు తొలగించడం కోసమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర చేపట్టారు.
భారత్ జోడోయాత్ర దేశంలో చారిత్రాత్మకంగా సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది
మత, కుల విద్వేషాలు రెచ్చగొడుతూ ఆర్థిక సంపదను కొద్ది మందికే దోచిపెడుతున్న దేశంలోని కార్పొరేట్ పరిపాలనకు స్వస్తి పలకడానికే రాహుల్ భారత్ జూడో యాత్ర చేపట్టారు.


రాహుల్ గాంధీ చేపట్టిన ఈ యాత్ర ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కోసం కాదు. దేశ జాతి ఐక్య నిర్మాణానికి చేస్తున్న యాత్ర భారత్ ఔన్నత్యాన్ని కాపాడటం కోసమే రాహుల్ గాంధీ ఈ యాత్ర చేపట్టారు.

Allso read:- జిల్లాలో బాణాసంచా అక్రమ నిల్వలు

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, టిపిసిసి సభ్యులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాడి రాం రెడ్డి
ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండీ అయుభ్ ఖాన్,ఫిషర్ మెన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి, ఇరుస వడ్ల వెంకన్న,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, జలపు అనంత రెడ్డి,మైల జయరాం రెడ్డి,చిట మాట రఘు,ఎండీ అఫ్సర్,వజ్జ సారయ్య, చెన్నోజు సూర్య నారాయణ,జాడి వెంకటేశ్వర్లు,వర్కింగ్ కమిటీ అధ్యక్షులుసీతారాం నాయక్ ఆకు తోట చంద్ర మౌళి, బండి శ్రీనివాస్,జెడ్పీటీసీ నామా కరం చంద్ గాంధీ,పులుసం పుష్ప లత శ్రీనివాస్, ఈసం రమ సురేష్,ఎంపీపీ విజయ రూపు సింగ్ తో పాటు అనుబంధ సంఘాల జిల్లా మండల అధ్యక్షులు సహకార సంఘం చైర్మన్ లు సర్పంచులు, ఎంపీటీసీలు ,సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.