Telugu News

ములుగులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో

రేవంత్ రెడ్డి ఇంటి పై దాడి అప్రజాస్వామికం...టీఆర్ఎస్ కార్యకర్తల గుండాగిరికి భయపడేదేలేదు

0

రేవంత్ రెడ్డి ఇంటి పై దాడి అప్రజాస్వామికం
ప్రజాస్వామ్య బద్దంగా పోరాడితే అప్రజాస్వామికంగా దాడి చేస్తారా
టీఆర్ఎస్ కార్యకర్తల గుండాగిరికి భయపడేదేలేదు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యములో ములుగు జాతీయ రహదారి పై బైఠాయించి రాస్తారోకో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

(ములుగు-విజయంన్యూస్)

ములుగు జిల్లా కేంద్రములో రేవంత్ రెడ్డి గారి ఇంటిపై టి.ఆర్.ఎస్ నాయకుల దాడిని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్  ఆధ్వర్యములో జాతీయ రహదారి పై బైఠాయించి రాస్తారోకో నిర్వహించ డం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రజాస్వామ్య బద్దంగా పోరాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  ఇంటిపై టీఆర్ఎస్ గుండాలు అప్రజాస్వామికంగా దాడిచేయడం సిగ్గుచేటుగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాదనలో భాగంగా జరిగిన ఉద్యమ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే టీఆర్ఎస్ పార్టీలో ఒక్క కార్యకర్త కూడా మిగిలి ఉండేవారు కారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రజాస్వామ్య బద్ధంగా న్యాయం జరగాలని పోరాడుతున్న రేవంత్ రెడ్డిపై పెరుగుతున్న ఆధరణ చూసి ఓర్వలేక, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అతని తనయుడు కల్వకుంట్ల తారకరామారావు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిపై దాడికి దించారని ఇంతటి అన్యాయానికి ఒడిగట్టిన పాపం ఊరికేనే పోదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రతిపక్ష నేతలపై విరుచకపడి దాడీలు చేయడమే ముఖ్యమనుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడీ ఏంటో చూపించక తప్పదని అన్నారు.
ప్రజాస్వామ్య బద్దంగా ఎదురుకోలేక టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేయడం సిగ్గుగా ఉందని, మరోసారి పునారావృతం అయితే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను, కార్యకర్తలను గ్రామాల్లో తిరగనివ్వకుండా చేస్తామని హెచ్చరిస్తున్నామన్నారు.

also raed : ‘రిపబ్లిక్’ ట్రైలర్ విడుదల చేసిన చిరంజీవి

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుస వడ్ల వెంకన్న,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,చిట మట రఘు,జాలాపు అనంత రెడ్డి, గంగారాం జెడ్పీటీసీ ఈసం రమ,మాజీ మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్,మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ముజఫర్,మాజీ సహకార సంఘం చైర్మన్ పాక సాంబయ్య,కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సునర్కని రాంబాబు,జిల్లా నాయకులు జాడి రాంబాబు,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్,యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మల్లం పెల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు చంద రాము,సర్పంచ్ లు పాముకుంట్ల బద్రయ్య,రత్నం బద్రయ్యా,అధికార ప్రతినిధి వంశీ కృష్ణ,మండల అధ్యక్షుడు వసంత శ్రీను,ఏటూరు నాగారం మండల ప్రచార కార్యదర్శి విద్య సాగర్,డైరెక్టర్ వంగ పండ్ల రవి యాదవ్, ఎస్టీ సెల్ మండల ఉపాధ్యక్షులు దేవ్ సింగ్,యూత్ కాంగ్రెస్ జిల్లా సహాయ కార్యదర్శి కిషోర్,యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి తారక్, మచ్చ శాఖ జిల్లా ఉపాధ్యక్షులు శంకర్,మహిళ కాంగ్రెస్ నాయకురాలు, యూత్ కాంగ్రెస్ నాయకులు  రాజు, మురళి,శివకిషోర్, చింటు, గోపిగణేష్,రవి,సుధాకర్,తదితరులు పాల్గొన్నారు

 

also raed :: దండోర యాత్రలో అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే సీతక్క.