Telugu News

ఎవరైతే నాకేంటి… వివాదాస్పదంగా ఇంచర్ల సర్పంచ్ వ్యవహారశైలి.

నేనే రాజు నేనే మంత్రి అంటున్న సర్పంచ్

0

ఎవరైతే నాకేంటి… వివాదాస్పదంగా ఇంచర్ల సర్పంచ్ వ్యవహారశైలి.

— నేనే రాజు నేనే మంత్రి అంటున్న సర్పంచ్.

— నిధుల దుర్వినియోగంలో ఇంచర్ల గ్రామ సర్పంచ్ నెంబర్ 1.

— నాసిరకం నిర్మాణాలకు అడ్డాగా ఇంచర్ల.

(ములుగు –విజయం ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి నెల నెల నిధులు మంజూరు చేస్తూ ఉంటే,స్వార్థపరులైన ఉన్నత అధికారుల అండదండలతో గ్రామస్థాయిలో కొందరు ప్రభుత్వ లక్ష్యానికి గండి కొడుతున్నారు.ఇందుకు ఉదాహరణ ములుగు మండలం,ఇంచర్ల గ్రామపంచాయితీలో నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలిచ్చి నాసిరకం నిర్మాణాలకు అడ్డాగా నిలిచిన వైనం కనబడుతుంది.రైతు వేదిక, శ్మశానవాటిక వంటి నిర్మాణంలో నాణ్యత లోపంతో కట్టడాలు చేసి, నిధులు స్వాహా చేయడంలో ముందంజలో ఉన్నారు.పంచాయతీ ఉన్నతాధికారులు అండదండలతోనే నాసిరకంగా నిర్మాణాలు చేస్తూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని గ్రామ పంచాయతీ వార్డు సభ్యులే సర్పంచ్ పై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయంలో కొసమెరుపు.ఇంచర్ల గ్రామ పంచాయితీ అభివృద్ధికి సహకరిస్తూ, ప్రజల సమస్యలు గ్రామ సభ దృష్టికి తీసుకుపోయి, సమస్యలను పరిష్కరించడానికి ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రయత్నిస్తున్నా, ఉన్నత అధికారుల అండదండలతో ఇంచర్ల గ్రామ సర్పంచ్ తన ఒంటెద్దు పోకడ నిర్ణయాలతో, అసంపూర్తిగా పనులు పూర్తి చేయకుండా నిధులు దుర్వినియోగం చేస్తున్నాడని వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ పని తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయమై గ్రామస్తులు, వార్డు సభ్యులు, సర్పంచ్ ను ప్రశ్నించగా నేను ఈ గ్రామ సర్పంచ్ ను నాఇష్టం వచ్చినట్లు చేస్తా మీరెవరు అడగడానికి, ఆస్ట్రాల్ వార్డు మెంబర్లు, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ దురుసుగా ప్రవర్తిస్తున్నాడని కలెక్టర్ కి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఇంచర్ల గ్రామపంచాయతీలో ఇంకా రైతు వేదిక, స్మశాన వాటిక వంటి పనులు పూర్తి కాలేదు. వాటి కట్టడాలు కూడా నాణ్యత లోపంతో కట్టిస్తూ, తన ఇష్టానుసారం వ్యవహరిస్తూ, ఇదేమిటి అని అడిగిన ప్రతిఒక్కరిని తను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడని గ్రామస్తులు వార్డు సభ్యులు వాపోతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న గ్రామపంచాయతీ సర్పంచ్ తీరుపై గతంలో కలెక్టర్ కు రెండుసార్లు ధరఖాస్తు చేశారని తెలియజేశారు. ములుగు జిల్లా, ములుగు మండలం కేంద్రానికి కూతవేటు దూరంలోనే నాసిరకం నిర్మాణాలతో, అవినీతి కార్యకలాపాలకు అడ్డాగా మారిన ఉన్నత అధికారులకు ఎందుకు కనబడడం లేదో వారి విజ్ఞతకే వదిలేయాలి.లేదా పంచాయతీ ఉన్నతాధికారులకు కాసుల మూటల ఉయ్యాలలో తులతూగుతూ అయినా ఉండాలి.జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, శివారు పల్లెల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో.

ఇది కూడా చూడోచ్చు :- ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం

గ్రామపంచాయితి నిధులు దుర్వినియోగం చేస్తున్న ఇంచర్ల గ్రామ సర్పంచ్ పై తగిన చర్యతీసుకొని, గ్రామపంచాయితి అభివృద్ధికి ఉన్నతాధికారులు సహకరిస్తారని ప్రజలు, గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్లు కోరుతున్నారు.