Telugu News

ములుగు జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్య

లాయర్ మల్లారెడ్డిగా అనుమానం..?

0

ములుగు జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్య

== లాయర్ మల్లారెడ్డిగా అనుమానం..?

== భూ వివాదాలే కారణమా..?

(రిపోర్టర్: లవకుమార్)

 ములుగు జిల్లా ప్రతినిధి ఆగస్టు 01 (విజయం న్యూస్):-

భూవివాదాలు మనుషులను ఇంత దారుణంగా హత్య చేయిస్తాయా..? డబ్బుల కోసం మనుషులు..మనుషులనే చంపేస్తారా..? పాత కక్ష్యలు ఇంత ఘోరానికి ఒడిగడతాయా..? ఈ హత్యను చూస్తే కచ్చితంగా అదే అనిపిస్తోంది. మనుషులు.. మనుషులే మ్రుగాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు..? పూర్తి వివరాల్లోకి వెళ్తే ములుగు జిల్లా లో దారుణమైన హత్య ఘటన చోటుచేసుకుంది. ములుగు మండలం లోని భూపాల్ నగర్ (పందికుంట) బస్ స్టేజ్ దగ్గర దారుణంగా ఒక వ్యక్తిని నరికి చంపిన ఘటన ములుగు జిల్లాలో దాదాపు 7 గంటల సమయంలో హత్య జరిగినట్టుగా పోలీసుల సమాచారం.మృతి చెందిన వ్యక్తి మల్లారెడ్డి గా పోలీసులు గుర్తించారు.మల్లారెడ్డి ఒక న్యాయవాది విధులు నిర్వహిస్తున్నారు. భూ వివాదాలు, పాత కక్షల వలనే దుండగులు ఇలాంటి ఘటనకు పాల్పడ్డారని తెలుస్తుంది.ఘటన స్థలాన్ని పోలీసులు పరీక్షిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: క్వార్టర్ బాటీల్ లో కల్తీ జరిగిందా..?