Telugu News

మొదటి చీరలను సమ్మక్క,సారక్కలకు అందించిన మంత్రి సత్యవతిరాథోడ్

పేదల సంక్షేమమే కెసిఆర్ ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి

0

మొదట వనదేవతలకు బతుకమ్మ చీరలు సమర్పించిన మంత్రి సత్యవతి

== రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్….

== 339 కోట్ల రూపాయలు వెచ్చించి, 10 రంగులు 18 డిజైన్లతో 200 రకాల చీరలు ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకలు…

నేతన్నలకు ఉపాధి

(రిపోర్టర్: రాజశేఖర్)

తాడ్వాయి, సెప్టెంబర్ 22( విజయం న్యూస్):-

పేదల సంక్షేమమే కెసిఆర్ ప్రభుత్వ చేయమని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం మండలంలోని మేడారంలో సమ్మక్క- సారలమ్మ వనదేవతలకు ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో అంకిత్, ములుగు ఏ ఎస్ పి సుధీర్ ఆర్ రామ్నాథ్ కేకన్, డి ఆర్ ఓ రమాదేవి, స్థానిక ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మొదట బతుకమ్మ చీరలను సమర్పించారు. అనంతరం మండలంలోని మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. మొదట ఎండోమెంట్ అధికారులు, పూజారులు డోలు వాయిద్యాలతో ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ఘనంగా ఆహ్వానించారు.

ఇది కూడా చదవండి: సూదిగాళ్లు ‘ఆ నలుగురే’ : ఏసీపీ
ఈ సందర్భంగా గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉండే కోట్లాదిమంది మహిళ సోదరీమణులకు ముఖ్యమంత్రి కెసిఆర్ తండ్రిలా అన్నల బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 18 సంవత్సరాల నిండిన ఆడబిడ్డలందరికీ బతుకమ్మ చీరలను కానుకగా అందజేస్తున్నారని, వారికి మహిళా సోదరీమణులందరికీ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ తండ్రిలా, అన్నల 339 కోట్ల రూపాయలు వెచ్చించి, 10 రంగులు 18 డిజైన్లతో 200 రకాల చీరలను ఆడబిడ్డలందరికీ బతుకమ్మ కానుకగా అందజేస్తున్నారని అన్నారు. మర మగ్గ నేతనులకు ఉపాధి కల్పించడంతో పాటు ఆడపడుచులకు ప్రేమపూర్వక చిలుకానుక అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. బతుకమ్మ చీరలతో నూతనలకు రెట్టింపు ఆదాయం వస్తుందని, ఇతరులకు చేతినిండా ఉపాధి లభించిందని అన్నారు. దేశంలో మహిళల కోసం అత్యధికంగా సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని అభివర్ణించారు. ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ.. జిల్లాలోని తొమ్మిది మండలాల్లో బతుకమ్మ చీరలు తరలించడం జరిగిందని, సంబంధిత తాసిల్దారులకు, తమకు కేటాయించిన బతుకమ్మ చీరలను వారి పరిధిలో ఉన్న రేషన్ డీలర్ వద్దకు వెళ్లి మహిళలు చీరలు స్వీకరించాలని కోరారు.

ఇది కూడా చదవండి: జిల్లాకు బతుకమ్మ సారెలొచ్చాయి..
ఈ కార్యక్రమంలో ములుగు జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, ఎంపీపీ గొంది వాణిశ్రీ, డి ఆర్ డి ఓ నాగ భవాని, స్థానిక తాసిల్దార్ ముల్కనూర్ శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి, ములుగు జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య, ఎంపీడీవో సత్య ఆంజనేయ ప్రసాద్, సర్పంచ్ చిడం బాబురావు, మేడారం ఈవో రాజేంద్రం, పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు, సమ్మక్క ప్రత్యేక పూజారి కొక్కర కృష్ణయ్య, పూజారులు కాక సారయ్య, మునీందర్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మండల అధ్యక్షులు దిడ్డి మోహన్ రావు, సీనియర్ నాయకులు దండుగుల మల్లయ్య, ఆలేటి ఇంద్రారెడ్డి,రజినికర్ రెడ్డి, ఎండోమెంట్ సిబ్బంది క్రాంతి, మధు, రఘుపతి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.