Telugu News

కేంద్రంపై నిప్పులు చెరిగిన సీతక్క

తప్పు చేసేది మీరు..శిక్ష విద్యార్థులకా..?

0

కేంద్రంపై నిప్పులు చెరిగిన సీతక్క

◆◆ దేశ బాధ్యత అనేది కేంద్ర ప్రభుత్వ బాధ్యత కాదా..?

◆◆ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం దేశ ప్రజలను ఇబ్బందులకు గురిచేసేది కేంద్రం కదా..?

◆◆ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పిందేవరు

◆◆ తప్పు చేసేది మీరు..శిక్ష విద్యార్థులకా..?

◆◆ అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలి

◆◆ సత్యాగ్రహ దీక్షలో కార్యక్రమంలో మండిపడిన ఎమ్మెల్యే సీతక్క

ములుగు/తాడ్వాయి, జూన్ 27(విజయం న్యూస్)

ఎఐసిసి ఆదేశాల మేరకు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ములుగు జిల్లా కేంద్రములో గాంధీ చౌక్ వద్ద కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన అగ్ని పత్ పథకం రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యములో సత్య గ్రహ దీక్ష
ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ సందర్భంగా మాట్లాడుతూ

Alldo read:- ప్రారంభమైన పాదయాత్ర.. అడుకున్న పోలీసులు
కేంద్ర ప్రభుత్వం హడావిడిగా అగ్ని పత్ పథకం తీసుకు రావడం వలన దేశ జాతీయ ప్రయోజనాలుదెబ్బతింటాయని నాలుగేళ్ల కాలానికి కాంట్రాక్టు పద్ధతిలో సైనికులను రిక్రూట్‌ చేయడం వల్ల వృత్తి నైపుణ్యాలతో కూడిన సాయుధ బలగాల సామర్ధ్యాన్ని పెంచడం సాధ్యం కాదని పేర్కొంది. పెన్షన్‌ డబ్బును ఆదా చేసుకోవడం కోసం ఈ పథకం తేవడమంటే మన వృత్తిపరమైన సాయుధ దళాల నైపుణ్యం, సామర్ధ్యంపై తీవ్రంగా రాజీపడడమేనని
గత రెండేళ్లుగా భారత సైన్యంలో ఎలాంటి రిక్రూట్‌మెంట్‌ లేదు. సాయుధ బలగాల్లోకి రెగ్యులర్‌ సైనికులను రిక్రూట్‌ చేసుకోవడానికి బదులు ఈ పథకాన్ని తీసుకొచ్చారు దీనివల్ల కాంట్రాక్టు సైనికులు తమ నాలుగేళ్ల సర్వీస్‌ తర్వాత ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకుండా మిగిలిపోతారుఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు తావిస్తుంది వారు ప్రైవేట్‌ మిలీషియాగా పనిచేసే పరిస్థితివైపు నెట్టబడతారు ఇప్పటికే తీవ్రమైన ఒడుదుడుకులకు గురవుతున్న మన సామాజిక వ్యవస్థపై దీని పర్యవసానాలు మరింత ప్రమాదకరంగా ఉంటాయి
ఉపాధి భద్రతకు కనీస రక్షణ కూడా లేకుండానే అత్యున్నత త్యాగాలు చేయడానికి సిద్ధపడాలంటూ మన యువతకు పిలుపునివ్వడం నేరపూరితమైన చర్య అని సీతక్క అన్నారు.

Allso read:- స్త్రీలు, పిల్లలపై పారెస్టు అధికారుల దాష్టికం
ఈ పథకం గురించి ప్రభుత్వం ప్రకటించిన మరు క్షణమే దేశంలోని వివిధ ప్రాంతాల్లో అప్పటికప్పుడు పెద్దయెత్తున నిరసనలు, ఆందోళనలు చెలరేగాయంటే ఈ పథకం పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థమవుతున్నది. ఈ రీత్యా అగ్నిపథ్‌ పథకాన్ని తక్షణమే రద్దు చేసి, సాయుధ బలగాల్లోకి రెగ్యులర్‌ రిక్రూట్‌మెంట్‌ వెంటనే చేపట్టాలని సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు


కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు యువకుల పై పెట్టిన కేసులు ఎత్తి వేయాలి పాత విధానాన్ని అమలు చేయాలని లేని యెడల కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటాలు ఉదృతం చేస్తామని సీతక్క అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెళ్లి రాజేందర్ గౌడ్,టీపీసీసీ కార్యదర్శి పైడా కులా అశోక్
చల్ల నారాయణ రెడ్డి,
మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాల్లడి రాం రెడ్డి, ఆక రాధాకృష్ణ,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య
ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్,మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండీ అయుభ్ ఖాన్,ఫిషర్ మెన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి
మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కొమురం ధన లక్ష్మి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి, ఇరుస వడ్ల వెంకన్న,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, చెన్నోజు సూర్య నారాయణ,మైల జయరాం రెడ్డి,చిట మాట రఘు,వజ్జ సారయ్య, జాడి వెంకటేశ్వర్లు, జాలపూ అనంత రెడ్డి,ఎండీ అఫ్సర్ పాషా,ఫిషర్ మెన్ రాష్ట్ర కార్యదర్శి గోల్కొండ రవి
వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్, రసుపుత్ సీతారాం నాయక్,జెడ్పీటీసీ
నామ కరం చంద్ గాంధీ
పులసం పుష్ప లత శ్రీనివాస్
ఈసం రమ సురేష్,తో పాటు మండల జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు,మాజీ జెడ్పీటీసీ లు ఎంపీపీ లు సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ కమిటీ అధ్యక్షులు జిల్లా మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు