Telugu News

బిజెపి పార్టీకి బుద్ధి చెప్పక తప్పదు: ఎంఆర్పీఎస్

ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి గజ్జెల ప్రసాద్ (మాదిగ)

0

బిజెపి పార్టీకి బుద్ధి చెప్పక తప్పదు

== కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా “సడక్ బంద్”

== ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్దత కల్పించడం లో కేంద్ర ప్రభుత్వం విఫలం అయింది.

== ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి భయపడి ముందస్తుగా నాయకులను ఎక్కడికక్కడ నిర్బంధం చేసి అరెస్టులు చేయడం సరికాదు….

ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి గజ్జెల ప్రసాద్ (మాదిగ)

ములుగు జిల్లా (తాడ్వాయి), జులై 02(విజయంన్యూస్): 

ములుగు జిల్లా కేంద్రంలో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సడక్ బంద్ నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి గజ్జెల ప్రసాద్ ( మాదిగ) మాట్లాడుతూ గతంలో మేనిఫెస్టో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజులలోనే వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపచేస్తామన్నటువంటి బిజెపి ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాలు గడిచిన వర్గీకరణ బిల్లు ఊసే లేకుండా పోయింది. తెలంగాణలో హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్నటువంటి బిజెపి జాతీయ మహాసభకు విచ్చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇకనైనా మాదిగల పట్ల మోసపూరితమైన విధానం కాకుండా మాదిగల మాదిగ కులాల బాధను అర్థం చేసుకొని ఈ సభలో వర్గీకరణ బిల్లు ఆమోదిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

allso read- కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఒక అజ్ఞానానికి

ఏ, బీ, సీ, డీ వర్గీకరణ పై నిర్ధిష్టమైన నిర్ణయం తీసుకోకపోతే బిజెపి సభను అడ్డుకుంటామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించిన నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి భయపడి ముందస్తుగా ఎమ్మార్పీఎస్ నాయకులను ఎక్కడికక్కడ నిర్బంధం చేసి, అక్రమ అరెస్టులు చేయడం సరైన పద్దతి కాదని అన్నారు. జిల్లా ఇంఛార్జి మాట్లాడుతూ
ములుగు పోలీస్ యంత్రాంగం అక్రమ అరెస్టులు చేసి అడ్డుకోవడం జరిగింది వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ప్రవేశపెట్టాలని కోరుతూ 03/07/2022 రోజున ఇవ్వకపోతే మాదిగల సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇరుగు పైడి మాదిగ ఎం ఎస్ పి జిల్లా ఇన్చార్జి, నెమలి నరసయ్య మాదిగ ఎమ్మెస్పీ జాతీయ నాయకులు, జన్ను రవి మాదిగ, ఎంఎస్పి ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి మడిపల్లి శ్యాంబాబు ,మాదిగ ఎం ఎస్ పి జిల్లా నాయకులు వావిలాల స్వామి, మాదిగ ఎంఎస్పీ జిల్లా నాయకులు పుల్లూరి కర్ణాకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ పేరాల బలరాం మాదిగ, ఎమ్మెస్ ఎఫ్ జిల్లా కన్వీనర్ నద్దునూరి రమేష్ మాదిగ ,ఎంఎస్పీ జిల్లా నాయకులు గజ్జల్లా ప్రశాంత్, మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు ఎనగందుల మొగిలి మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు భద్రయ్య, మాదిగ తదితరులు పాల్గొన్నారు.