గుంతను పూడ్చిన అధికారులు
తాటికొమ కథనానికి స్పందించిన ఎస్ఐ
–విజయం పత్రికకు అభినంధనలు
(ములుగు-విజయం న్యూస్)
ఇటు రావోద్దంటున్న తాటికొమ్మ పిలుపుకు అధికారులు స్పందించిండ్రూ.. వెంటనే పోలీసులు ఎస్ఐ ఆధ్వర్యంలో తాటికొమ్మను తొలగించి అక్కడ పడిన గుంతను పూడ్చిండ్రూ.. అందుకు ప్రజలు మంచి కథనాన్ని అందించిన “విజయం” పత్రికకు అభినంధనలు తెలిపిండ్రూ.. అలాగే గుంతను పూడ్చిన ఆర్ అండ్ బీ ఏఈ, ఎస్ఐ, పోలీసులకు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే
జాతీయ రహదారి 163 మంగపేట మండలం, వాడ గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పడిన పెద్ద గుంతలో ఎవలో తాటి కొమ్మను పెట్టిండ్రూ. ఇక్కడ గుంత ఉన్నది.. ఇటిగాని అస్తే ప్రమాదమని చెప్పెటందుకు తాటికొమ్మను గుంతలో పెట్టిండ్రూ.. ఇంతలో అటుగానం పోతున్న విజయం పత్రిక విలేకరి పోటో తీసి పేపర్లో పెట్టిండూ.. ఇంకేమున్నది.. అధికారులు.. ప్రజలందరు చూసిర్రూ.. ఆర్అండ్ బీ అధికారులను మాటన్నరు.. ఇగ అయితే మన ఆర్ అండ్ బీ ఏఈ, అలాగే మంగపేట ఎస్సై తాహెర్ బాబా ఆ వార్తను చూసి వెంటనే తన సిబ్బందితోని అక్కడికి పోయి చూసిండ్రూ..
నిన్నటి పోటో దృశ్యం..
విజయం పేపర్ రాసింది వాస్తవమేనని వెంటనే తమ సిబ్బందితోని పెద్దగా ఏర్పడిన గొయ్యిలో కంకరతో పూర్తిగా నింవేశారు. నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉండే రహదారిలో ప్రమాదభరితంగా ఉన్న గొయ్యిని పోలీస్ శాఖ వారు చొరవ తీసుకొని గొయ్యి ని పూడ్చడం తో పరిసర ప్రాంత ప్రజలు, వాహనదారులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తూ మంగపేట ఎస్సై వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.