Telugu News

గుర్రంపై వచ్చి ఆ పని చేసిన యువకుడు

ఇక్కడివాడ్నే గెలిపించాలని వినతి

0

గుర్రంపై వచ్చి ఆ పని చేసిన యువకుడు

== ఇక్కడివాడ్నే గెలిపించాలని వినతి

(మునుగోడు-విజయంన్యూస్)

మోటర్ సైకిల్ పై వెళ్లి నామినేషన్ వేసింది చూశాం.. ఆటోలో వెళ్లి నామినేషన్ వేసింది చూశాం.. నడుచుకుంటూ వెళ్లి నామినేషన్ వేసింది చూశాం.. ఆసుపత్రి నుంచి నేరుగా వెళ్లి నామినేషన్ వేసింది చూశాం.. పెళ్లిపీటలపై నుంచి వెళ్లి నామినేషన్ వేసింది చూశాం.. కానీ మునగోడులో ఓ యువకుడు మరోరకంగా వచ్చి నామినేషన్ వేశాడు.. ఆయన నామినేషన్ కేంద్రానికి రావడంతోనే అందరు అశ్ఛర్యంగా చూశారు. ఎందుకో వచ్చాడని అందరు అనుకున్నారు. కానీ నేరుగా నామినేషన్ కేంద్రంలోకి వెళ్తుండటంతో ఒక్కసారిగా మీడియావాళ్లు చుట్టుముట్టారు.

allso read- మునుగోడు బరిలో  ఉప ఎన్నికకు 140 నామినేషన్లు

ఎందుకు గుర్రంపై వచ్చావని అడిగితే మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ వేసేందుకు వచ్చానని తెలిపాడు. దీంతో అందరు అవాక్కైయ్యారు. ఇంతకి ఎవరని అనుకుంటున్నారా..? నల్గొండ జిల్లా నాంపల్లి మండలంల ఉప్పరిగూడెం గ్రామానికి చెందిన డాక్టర్ వీరభోగ వసంతరాయలు అనే వ్యక్తి గుర్రంపై నేరుగా చుండూరు తహసీల్దార్ కార్యాలయంకువచ్చి  నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను హైదరాబాద్ లో వైద్యుడిగా పనిచేస్తున్ననని, మా నియోజకవర్గంలో బీసీలకు న్యాయం జరగడం లేదని అందుకే నేను బీసీల పక్షాన నిలిచి నామినేషన్ దాఖలు చేసి బరిలో నిలుస్తున్నానని, నన్ను అశీర్వదించాలని కోరారు.