Telugu News

7 వేల దాటిన టీఆర్ఎస్ మెజారిటీ

12వ రౌండ్ లో 7,794 ఓట్ల ఆధిక్యం

0

7 వేల దాటిన టీఆర్ఎస్ మెజారిటీ

== 12వ రౌండ్ లో 7,794 ఓట్ల ఆధిక్యం

  • 12 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయిన వైనం
  • టీఆర్ఎస్ కు పోలైన ఓట్లు
  • వెనకబడిన బీజేపీ
  • డిపాజిట్ దక్కించుకోలేని కాంగ్రెస్

(మునుగోడు-విజయం న్యూస్)

మునుగోడు ఉప ఎన్నిక క్షణం..క్షణం టెన్షన్ కు గురిచేసింది.. రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారుతూ అటు అభ్యర్థుల్లో ను..ఇటు రాష్ట్ర ప్రజల్లో ను టెన్షన్ వాతావరణాన్ని నెలకొల్పింది. మొదటి ఐదు రౌండ్ల వరకు నేరాలు తెగే ఉత్కంఠతను చూపించిన ఫలితాలు, ఆ తరువాత కొంత టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపింది. దీంతో అధికార టీఆర్ఎస్ దాదాపుగా విజయం సాధించినట్లే కనిపిస్తోంది‌. 12రౌండ్లలో కూడ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా…మధ్యాహ్నం 2 గంటల సమయాని పూర్తి కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల 9రౌండ్ల ఓట్ల లెక్కింపు మాత్రం పూర్తి అయ్యింది. సాయంత్రం 4గంటల వరకూ 12 రౌండ్లే పూర్తి చేశారు.   ఇంకా 3 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ లో ఆధిక్యత కనబరచిన టీఆర్ఎస్… ఆ తర్వాత 2, 3 రౌండ్లలో వెనుకబడిపోయింది. అయితే తిరిగి 4 వ రౌండ్ లోనే ఆధిక్యంలోకి దూసుకువచ్చిన టీఆర్ఎస్ వరుసబెట్టి ప్రతి రౌండ్ లోనూ మెజారిటీ సాధిస్తూ సాగుతోంది.

 

12వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేసరికి టీఆర్ఎస్ కు 81,817 ఓట్లు వచ్చాయి. అదే సమయంలో తన సమీప ప్రత్యర్థి బీజేపీకి 74,225 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ కు 21,218 ఓట్లు వచ్చాయి. వెరసి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 7,794 ఓట్ల మెజారిటీ లభించినట్టైంది.  మరో 2,3 రౌండ్లు పూర్తి అయ్యేసరికే టీఆర్ఎస్ విజయం ఖాయమైనట్టేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి.