అందరి చూపు మునుగోడు వైపు
== ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో అన్ని పార్టీల్లో చలనం
== ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్
== అభ్యర్థి వేటలో టీఆర్ఎస్
== రాజగోపాల్ పేరును ఖారారు చేయని బీజేపీ
== అసక్తికరంగా మారనున్న మునుగోడు రాజకీయం
(మునుగోడు- విజయంన్యూస్)
అందరు ఊహించినదే జరిగింది.. అతి కొద్ది రోజుల్లోనే ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అవుతుందని భావించినట్లుగానే సీఈసీ ఉప ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికితోపాటు విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరు మునుగోడు వైపు చూసే పరిస్థితి ఏర్పడింది. జజనరల్ ఎన్నికల కంటే కొద్ది రోజుల ముందు వస్తున్న ఈ ఎన్నికలను అన్ని పార్టీలు రెపరెండంగా భావిస్తున్నాయి.
allso read- మోగిన మునుగోడు ఉప ఎన్నిక నగారా
రాబోయే ఎన్నికలకు ఇది సెమిపైనల్ గా భావిస్తున్న ప్రధాన పార్టీలు అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. కచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచితీరాలని అనుకుంటున్న ప్రధాన పార్టీలకు మునుగోడు చాలెంజ్ కానుంది. దీంతో గత నాలుగు నెలల ముందు నుంచే ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మునుగోడుపై దృష్టి సారించాయి. మునుగోడులో మూడు నెలల ముందు నుంచే రాజకీయ హాడాహుడి చేసిన ఆ పార్టీలు ఇప్పటికే ప్రతి మండలానికి, ప్రతి బూత్ లకు ఇంచార్జ్ లను నియమించింది. అలాగే ఎమ్మెల్యే, ఎంపీలు, ఆ స్థాయి నాయకులను ఆయా మండలాలకు, క్లస్టర్లకు ఇన్ చార్జ్ లను నియమించింది. ఇదిలా ఉండగా బీజేపీ మాత్రం నేరుగా మునుగోడు కేంద్ర మంత్రులను రంంలోకి దింపడంతో మునుగోడు ఉప ఎన్నిక చాలా ఉత్కంఠగా మారేఅవకాశం ఉంది.
== ముందే అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్
ఉప ఎన్నికలైనా, సాధాహరణ ఎన్నికలైనా అభ్యర్థుల ఎంపిక విషయంలో కిలోమీటర్ల దూరంలో ఉండే కాంగ్రెస్ ఈ సారి కూతవేటు దూరంగానే ఉంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో చివరి గంట వరకు
నాన్చుడు దొరణి అవలంభించే కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల కంటే ముందుగానే నోటిఫికేషన్ రాక ముందు అభ్యర్థిని ప్రకటించి అందర్ని అశ్ఛర్యపరిచింది. అంతే కాకుండా జిల్లా స్థాయి నాయకులను అన్ని బూతులకు ఇంచార్జ్ లుగా నియమించింది. గ్రామస్థాయిలో కమిటీలను బలోపేతం చేసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ముఖ్యమైన నాయకత్వం మొత్తం మునుగోడుల పర్యటిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలని భావిస్తున్న కాంగ్రెస్ అందుకు తగ్గట్లుగానే అడుగులు వేస్తోంది.
allso read- దసరా రోజే ముహుర్తం
ప్రధాన నాయకత్వం బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారో అదే చెబుతున్నారు. కాంగ్రెస్ ఏం చేసిందో…ఏం చేయబోతుందో చెబుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ సర్వం సిద్దమైందనే చెప్పాలి. తన సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
== కూతకూయని గులాబీ పార్టీ
మునుగోడులో బలంగా ఉన్న ప్రధాన పార్టీలో గులాబీ పార్టీ ఒక్కటి. 2014 ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ కావడం, నల్గొండ జిల్లాలో ఏ ఉప ఎన్నిక వచ్చిన టీఆర్ఎస్ గెలవడం అనువాయితీగా మారింది. దీంతో మునుగోడు ఉప ఎన్నిక కుడా ఆపార్టీకి సవాల్ గా మారింది. రాబోయే ఎన్నికలకు ఈ ఎన్నిక సెమిపైనల్ కావడంతో టీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధించాలన్న, సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించాలన్న మునుగోడు ఉప ఎన్నిక ల్లో విజయం సాధించడం చాలా అవసరం. అందుకే టీఆర్ ఎస్ పార్టీ అచితూచి అడుగులు వేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఏ ఉప ఎన్నిక వచ్చిన, సాధాహరణ ఎన్నికలు వచ్చిన అభ్యర్థులను ముందుగానే ప్రకటించే సీఎం కేసీఆర్ ఈ సారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిటింగ్ చేశారంటే కొంత ఆలోచించాల్సిందే. అయితే ఉప ఎన్నికకు సంబంధించిన ప్రచారం విషయంలో మాత్రం చాలా దూకుడుగా వెళ్తోంది. ఏ ఉప ఎన్నికకు లేనంతగా సీఎం కేసీఆర్ మునుగోడు కు ఇప్పటికే రెండు సార్లు పర్యటన చేయండం, బహిరంగా సభను నిర్వహించడం, అద్భుతంగా వరాలు కురిపించడం, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని ఇంచార్జ్ లుగా నియమించడం జరిగింది. ప్రతి రోజు అక్కడ ఎన్నికల ప్రచారం చేస్తూనే ఉన్నారు.
== రాజగోపాల్ రెడ్డికేనా..? బీజేపీ పార్టీ ఏం చేస్తోంది.
మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ పార్టీకి సవాల్ గా మారింది. త్రిబుల్ ఆర్ గా అసెంబ్లీలో ఉన్న సమయంలో మరో ఆర్ జతచేరేందుకు సిద్దమైయ్యారు. ఈ మేరకు రాజీనామా చేసి బీజేపీలో చేరగా అనివార్యమైన ఈ ఉప ఎన్నికను బీజేపీ రెపరెండంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగానే బీజేపీ అన్ని ప్రయత్నాలు చేసే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తుండగా, కేంద్రమంత్రులు, జాతీయ స్థాయి నాయకులు, రాష్ట్ర నాయకత్వం పర్యటించి మునుగోడు ప్రజలకు భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే
కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా విజయం సాధించి, ఆ పదవికి రాజీనామా చేసి బీజేపీ పార్టీలోచేరిన కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటిస్తుందా..? అంటే ఏమో అనే విధంగా సమాధానాలు వస్తున్నాయి. అభ్యర్థి ఉన్నప్పటికి బీజేపీ పార్టీ ఇప్పటి వరకు ప్రకటించకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఈ మూడు ప్రధాన పార్టీలకు ఈ ఎన్నిక కచ్చితంగా రెపరెండంగానే భావించే అవకాశం ఉంది. అయితే ప్రజలు ఏ పార్టీని అదరిస్తారో..? ఏ అభ్యర్థిని గెలిపిస్తారో చూడాలి.
allso read- ఏయ్ కందాళ.. కళ్లు విప్పి చూడు : రేణుక చౌదరి