Telugu News

మోగిన మునుగోడు ఉప ఎన్నిక న‌గారా

ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సీఈసీ

0

మోగిన మునుగోడు ఉప ఎన్నిక న‌గారా
== ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సీఈసీ
== ఈనెల 7న నోటిఫికేష‌న్
== నవంబర్ 3న పోలింగ్, 6న కౌంటింగ్
హైద‌రాబాద్‌- విజ‌యంన్యూస్‌)
తెలంగాణ రాష్ట్రంలో మ‌రో ఉప ఎన్నిక‌కు న‌గారా మోగింది.. మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది.. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం సోమ‌వారం ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మొత్తం6 రాష్ట్రాల్లోని ఖాళీ అయిన 7 అసెంబ్లీ స్థానాల‌కు ఉప ఎన్నిక‌ను నిర్వ‌హించేందుకు సీఈసీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడుతో పాటు మ‌హ‌రాష్ట్ర లోని అందేరి, బీహార్ లోని మోక్క‌మ్మ‌, గొప‌లంజి, హార్యాన‌లోని అడేంపూర్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని గోల గోక్రాంత‌, ఓడిస్సాలోని దంగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఉప ఎన్నిక షెడ్యూల్ ను సీఈసీ విడుద‌ల చేసింది. ఆయా రాష్ట్రాల్లో షెడ్యూల్ ప్ర‌క‌ట‌న అనంత‌రం ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌స్తుంద‌న్నారు.

allso read- దసరా రోజే ముహుర్తం 
== షెడ్యూల్ ఇలా
అక్టోబ‌ర్ 7న ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తున్న‌ట్లు సీఈసీ ప్ర‌క‌టించింది. అదే రోజు నుంచి నామినేష‌న్ల ప్ర‌క్రీయ ప్రారంభ‌మ‌వుతుంద‌ని,ఈనెల 14న నామినేష‌న్ల‌కు అఖ‌రి గ‌డువు అని ప్ర‌క‌టించింది. 15న నామినేష‌న్ల ప‌రిశీల‌న‌, 17 వ‌ర‌కు విత్ డ్రాల‌కు అవ‌కాశంక‌ల్పించింది. న‌వంబ‌ర్ 3న పోలింగ్‌, 6న కౌంటింగ్ , 8న ఎన్నిక‌ల ప్ర‌క్రీయ‌ను పూర్తి చేస్తున్న‌ట్లు సీఈసీ ప్ర‌క‌టించింది.
== మునుగోడు ఉప ఎందుకు
తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడులో ఉప ఎన్నిక కు సీఈసీ షెడ్యూల్ ను విడుద‌ల చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు శాస‌న‌స‌భ్యుడిగా ప‌నిచేసిన కొమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే స‌భ్య‌త్వానికి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరారు. దీంతో అక్క‌డ ఉప ఎన్నిక అనివార్య‌మైంది.

allso read- అక్టోబర్ 6న ముహుర్తమా..?జాతీయ పార్టీ కోసమా..? హ్యాట్రిక్ కోసమా