Telugu News

15 రోజులుగా మునుగోడులోనే మంత్రి పువ్వాడ మకాం

జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు కూడా అక్కడే

0

15 రోజులుగా మునుగోడులోనే మంత్రి మకాం

== జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు కూడా అక్కడే

== తిరిగి ఇంటికి చేరిన పార్టీ నేతలు

(ఖమ్మం-విజయంన్యూస్)

మునుగోడులో ప్రచారం పర్వం ముగిసింది.. దీంతో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం జిల్లా నుంచి ప్రచారం కోసం వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరు తెరాస పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్, సండ్ర వెంకటవీరయ్య, రేగా కాంతారావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాతాముధుసూదన్, జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజు, డీసీసీబీ చైర్మన్ కూరాకాలు నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు  సుమారు 15 రోజుల పాటు మునుగోడులోనే మకాం వేసి, అక్కడ ఓటర్లను కలిసి ప్రచారం చేశారు. ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలకు వివరించారు.

allso read- మునుగోడు లో కేటీఆర్ రోడ్డు షోలో జనమే జనం

కాంగ్రెస్, బీజేపీ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తాయో, ప్రభుత్వం ఎలా ప్రజలకు అండగా ఉంటుందో వివరించారు. ఉదయం 6గంటలకే గ్రామాల్లో పర్యటించి ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. మంత్రులు అందరు మునుగోడు వచ్చినప్పటికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాత్రం అందుకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఉదయం 6గంటల నుంచి రాత్రి 9గంటల వరకు విరామం లేకుండా ప్రచారం నిర్వహించి, ఓటర్లతో మాట్లాడి, గ్రామాల్లో నాయకులను సమన్వయం చేస్తూ పనిచేశారు.  తన చాణక్యం, వ్యూహం, రాజకీయ చతురతను ప్రదర్శించిన పువ్వాడ అజయ్, ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టే వ్యక్తిగా నిలిచారు. భారీ మెజార్టీ సాధించి సీఎంకు కానుకగా అందిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న మంత్రి అజయ్, ప్రతిరోజూ ప్రజలతో మమేకమైయ్యారు. అహర్నిశలు పార్టీ విజయానికి క్షేత్ర స్థాయిలో కృషి చేసిన మంత్రి,  ప్రతిఎన్నికలో తెరాస విజయదుందుభి మోగించే విధంగా పనిచేశారు. మంత్రికి తోడుగా శ్రమించిన ఖమ్మం నియోజకవర్గ గులాబీ దళం, గ్రామాల్లో విస్తృత ప్రచారం చేసి ఓట్లు అభ్యర్థించారు. మొత్తానికి మంగళవారం ప్రచారం ముగించడంతో అందరు మునుగోడును వీడారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హైదరాబాద్ కు వెళ్లగా, నాయకులు ఖమ్మం జిల్లాకు తిరిగి చేరుకున్నారు.

allso read- మునుగోడులో ఎమ్మెల్యే ఈటెల కాన్వాయ్ పై దాడి..ఎమ్మెల్యే పెద్దిసుదర్శన్ రెడ్డి, జడ్పీచైర్మన్ జగదీష్ కు గాయాలు