కాంగ్రెస్ ఖేల్ ఖతం..దుకాణం బంద్
== ఉమ్మడి నల్లగొండ జిల్లాలో క్లీన్ స్వీఫ్ చేసిన టీఆర్ఎస్
== అన్ని స్థానాలను కైవసం చేసుకున్న గులాబీదళం
== మునుగోడులో డిపాజిట్ కూడా దక్కించుకుని కాంగ్రెస్
== అతిదారుణంగా పడిపోయిన గ్రాఫ్
== మునుగోడు ఓటమితో రేవంత్ నాయకత్వానికి పరీక్ష
నల్లగొండ,నవంబర్6(విజయంన్యూస్):
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖేల్ ఖతం దుకాణం బంద్ అన్నట్లుగా మారింది.. నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ 12 స్థానాలకు 12 గెలిచి క్లీన్ స్వీఫ్ చేసింది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఖాళీ అయింది. సిట్టింగ్ స్థానమైన మునుగోడును నిలబెట్టులేకపోయింది. దీంతో మొత్తం సీట్లు టిఆర్‌ఎస్ ఖాతాలో చేరాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత జరిగిన ఏ ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ గెలవకపోవడం తరవాత సంగతి, కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. దుబ్బాక, హుజుర్‌నగర్, హుజురాబాద్ ఉప ఎన్నికతో పాటు తాజాగా జరిగిన మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవి చూసింది.
ఇది కూడా చదవండి :మునుగోడులో ‘కారు’ జోరు
అధికార పార్టీకి కనీసం పోటీని కూడా ఇవ్వలేకపోయింది. అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ రేవంత్ రెడ్డి చేసిన ప్రచారాన్ని మునుగోడు ప్రజలు నమ్మలేకపోయారు. కేసీఆర్‌కే పట్టం కట్టారు. రెండో రౌండ్ ఫలితం వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. గెలుస్తామనే ధీమాతో ఉన్న ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగలడంతో కకావికలమైంది. ఊహించిన ఓట్లు కూడా పోల్ కాలేదు. మునుగోడు ఉప ఎన్నికలో 2,41,805 ఓట్లకుగాను మొత్తం 2,25,192 ఓట్లు పోలయ్యాయి. పోలై చెల్లుబాటైన ఓట్లలో 1/6 వంతు వస్తే డిపాజిట్ దక్కినట్లుగా ప్రకటిస్తారు. అంతకంటే తక్కువ ఓట్లు వస్తే డిపాజిట్ కోల్పోయినట్లు. పాల్వాయి స్రవంతి డిపాజిట్ దక్కించుకోవాలంటే 37,532 ఓట్లు రావాలి. కానీ అన్ని ఓట్లు రాలేదు. కేవలం 21 వేల పైచిలుకు ఓట్లే స్రవంతికి పోలయ్యాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాలు మినహా అన్ని స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. ఎన్నికల ఫలితాల అనంతరం హుజుర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు.
ఇది కూడా చదవండి: మునుగోడులో కుట్రదారులకు చెంప పెట్టు : నామా
ఈ క్రమంలో టీఆర్‌ఎస్ తరఫున శానంపూడి సైదిరెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ఇక మునుగోడు నుంచి గెలిచిన కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి కొద్ది నెలల క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, బీజేపీ తరపున రాజగోపాల్ రెడ్డి పోటీ చేశారు. మొత్తంగా పాల్వాయి స్రవంతి మూడో స్థానానికి పరిమితమై ఓటమిని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో మునుగోడులో టీఆర్‌ఎస్ విజయం సాధించి, రికార్డు సృష్టించింది.
== నిశబ్ధం పాటించిన ఆగ్రనాయకత్వం
నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ జిల్లా అని అంటుంటారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి జానారెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పటెల్ రమేష్ రెడ్డి, అద్దంకి దయాకర్ రావు, దాసోజు శ్రావణ్ లాంటి కీలక నాయకులు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు. మంచిమంచి పదవులను పొందారు. కోమటిరెడ్డి బద్రర్స్ కూడా మొన్నటి వరకు పీసీసీ రేసులో ఉన్న పరిస్థితి కనిపించింది.
ఇది కూడా చదవండి విజయం కథనానికి స్పందన
అయితే రేవంత్ రెడ్డికి పీసీసీ పదవిని ఇవ్వడంతో సీనియర్లందరు అలక బూనినట్లు కనిపించింది. దీంతో జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొమట్ రెడ్డి బ్రదర్స్, దాసోజు శ్రావణ్ లు కొద్దినెలల పాటు నిశబ్ధం పాటించినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి వర్గంలో ఉన్న రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పటెల్ రమేష్ రెడ్డి, అద్దంకి దయాకర్ రావులు మాత్రమే పనిచేసినట్లు కనిపించింది. ఆ తరువాత మిగిలిన వారేవ్వరు అక్కడ పనిచేయనట్లు కనిపించింది. సాధాహరణ ఎన్నికల కంటే ముందుగా డూఆర్ డై అనుకున్న సందర్భంలో కష్టపడి పనిచేయాల్సిన నాయకులు రేవంత్ రెడ్డిపై ఓటమి భారం మోపేందుకు దూరమైనట్లు కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన మునుగోడును కాంగ్రెస్ పార్టీ చేతులారా వదిలేసుకున్న పరిస్థితి కనిపించింది.
== కూలిపోయిన కాంగ్రెస్ కంచుకోట
2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఆ మూడింటింటిలోనూ టీఆర్‌ఎస్ పార్టీ విజయఢంకా మోగించింది. కాంగ్రెస్ పార్టీకి, ఉమ్మడి నల్గొండ జిల్లాల తరుపున అధిపత్యం వహిస్తూ పదవులు పొందిన ఈ నాయకులందరు కేంద్రాల్లో ఉప ఎన్నిక వచ్చింది. హుజుర్‌నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 43,359 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నాగార్జున సాగర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ గెలుపొందారు. నోముల భగత్ 18,804 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాగా సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జానారెడ్డి రెండో స్థానానికే పరిమితమయ్యారు. ప్రస్తుతం మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. దీంతో 2018 ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 3 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, నకిరికల్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీలో చేరగా, మిగిలిన ఇద్దరిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవడంతో అసెంబ్లీకి రాజీనామా చేసి ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీఫ్ చేసింది.
ఇది కూడా చదవండి: టీఆర్ఎస్ ది గెలుపు కాదు.. నాదే నైతిక గెలుపు: రాజగోపాల్ రెడ్డి