Telugu News

ప‌నుల కోసం పైస‌ల కోసం పార్టీ మారిన కాంట్రాక్ట‌ర్ రాజ‌గోపాల్ ః మంత్రి పువ్వాడ‌

== మునుగోడు ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న మంత్రి పువ్వాడ‌

0

ప‌నుల కోసం పైస‌ల కోసం పార్టీ మారిన కాంట్రాక్ట‌ర్ రాజ‌గోపాల్ ః మంత్రి పువ్వాడ‌
== మునుగోడు ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న మంత్రి పువ్వాడ‌
== స్వాగ‌తం ప‌లికిన స్థానిక బీఆర్ఎస్ నాయ‌కులు
(మునుగోడు-విజ‌యంన్యూస్‌)
పనుల కోసం ప‌నుల పేరుతో సంపాధించిన‌ పైస‌లను కాపాడుకోవ‌డం కోసం పార్టీ మారిన కాంట్రాక్ట‌ర్ రాజ‌గోపాల్ రెడ్డి అని రాష్ట్ర ర‌వాణాశాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ ఆరోపించారు. మునుగోడు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపు కోసం అధినేత, సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు మునుగోడు మండలంలోని కోరిత్కల్ గ్రామంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదివారం ప్రచారం నిమిత్తం అక్క‌డ ప‌ర్య‌టించారు. దీంతో స్థానిక బీఆర్ఎస్ నాయ‌కులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. చాలువ‌ల‌తో ఘ‌నంగా స‌న్మానం చేశారు. అనంత‌రం ఓ ఫంక్షన్ హల్ లో కార్యకర్తలు, నాయకులతో సమావేశమమై పార్టీ పరిస్థితి, భవిష్యత్‌ కార్యచరణపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చర్చించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిని మునుగోడు ప్ర‌జ‌లు నెత్తి మీద పెట్టుకున్నారని, ఏదో చేస్తార‌ని అనుకుంటే ఏం చేయ‌కుండానే పార్టీ మారిపోయార‌ని అన్నారు. క‌నీసం నియోజ‌క‌వ‌ర్గం వైపు తిరిగి చూడ‌లేద‌న్నారు. అలాంటి వారిని ఎలా గెలిపిస్తారో మునుగోడు ప్ర‌జ‌లు ఆలోచించుకోవాల‌ని అన్నారు.

allso read- మునుగోడులో తొలిసారి బరిలో లేని సీపీఐ..