Telugu News

మునుగోడులో ‘కారు’ జోరు

బీజేపీ అభ్యర్థిపై టిఆర్‌ఎస్‌ ఘన విజయం

0

 

మునుగోడులో ‘కారు’ జోరు

== బీజేపీ అభ్యర్థిపై టిఆర్‌ఎస్‌ ఘన విజయం

== చివరి వరకు పోరాడిన కమలదళం

== డిపాజిట్‌ దక్కని కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి

== ఓటమిని అంగీకరించిన బిజెపి నేత రాజగోపాల్‌ రెడ్డి

== సంబరాల్లో మునిగిన టిఆర్‌ఎస్‌ శ్రేణులు

నల్లగొండ,నవంబర్‌6(విజయంన్యూస్):

తెలంగాణ రాష్ట్రంలో కారు జోరుమీదుంది.. ఉప ఎన్నిక అంటేనే కేరాఫ్ టీఆర్ఎస్ అన్నట్లుగా ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చిన ఆ సీటును దక్కించుకునే టీఆర్ఎస్ పార్టీ మునుగోడు నియోకవర్గాన్ని కూడా తన ఖాతాలో జమ చేసుకుంది. ఉప ఎన్నిక పోరులో గులాబీదే పై చెయ్యి  అవుతుందని భావించినట్లుగానే మునుగోడు విషయంలో కూడా అదే జరిగింది.. హోరాహోరీ పోరులో టీఆర్ఎస్ విజయం సాధించింది. కానీ బిజెపి కోరుకున్న మునుగోడు మాత్రం ఉప ఎన్నికలో బొక్కబోర్లా పడింది. తొడగొట్టి సవాల్ చేసిన బీజేపీ నాయకులు ఫలితాల్లో కిందపడిపోయారు..  అధికార టిఆర్‌ఎస్‌ ఇక్కడ విజయం సాధించి తనకు తిరుగులేదని నిరూపించింది. విమర్శలు,ప్రతి విమర్శలు, హోరా హోరీ పోరులో అంతిమ విజయం గులాబీనే వరించింది.

ఇది కూడా చదవండి: మునుగోడులో కుట్రదారులకు చెంప పెట్టు : నామా

మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు రాజీనామా చేసి బిజెపిలో చేరడంతో అనివార్యమైన ఉప ఎన్నికకు 47 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ పార్టీ అభ్యర్థిగా కొమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా శంకర్ చారి, ప్రజాశాంతి పార్టీ నుంచి కే.ఎ.పాల్ బరిలో నిలిచారు. కాగా  ఈనెల 3న పోలింగ్ జరిగింది. ఆదివారం ఫలితాలను లెక్కించారు. ఉదయం 8గంటలకు ప్రారంభమైన ఈ ఫలితాలు సాయంత్రం 5గంటల వరకు కొనసాగింది. ముందుగా 686 పోస్టల్ ఓట్లు పోల్ అవ్వగా, ఆ ఓట్లను లెక్కించారు. దీంతో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో టీఆర్ఎస్ పార్టీ నాలుగు ఓట్ల మెజారిటీ సాధించింది. ఆ తరువాత 9 గంటలకు మొదటి రౌండ్ ఫలితం రాగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 1192 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఆ తరువాత రెండవ, మూడవ రౌండ్ లో బీజేపీ స్వల్ప అధిక్యం వచ్చింది. ఆ తరువాత నాలుగు, ఐదు రౌండ్లలో టీఆర్ఎస్ స్వల్ప ఓట్ల తేడాతో ముందుంజలో ఉంది.  దీంతో ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ పార్టీ 1430 ఓట్ల మెజారిటీతో ముందజలో ఉంది. ఆ తరువాత టీఆర్ఎస్ పార్టీ వెనుగుతిరిగి చూడలేదు. వరస రౌండ్లలో తమ అథిపత్యాన్ని ప్రదర్శించుకుంది. 6వ రౌండ్ పూర్తైయ్య సరికి 2,162 ఓట్ల మెజారిటీ, 7వ రౌండ్ పూర్తయ్యే సరికి 2,555, 8వ రౌండ్ పూర్తయ్యే సరికి 3,285, 9 వరౌండ్ కు వచ్చేసరికి మెజారిటి మరింత పెరిగింది. దీంతో 3,925 ఓట్ల మెజారిటీతో, 10వ డివిజన్ లో 4,446 ఓట్ల మెజారిటీతో, 11 రౌండ్లలో 5,800, 12వ రౌండ్లలో 7,794 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ పార్టీ ముందజలో ఉంది. అలాగే 13 రౌండ్ లో 9039 ఓట్లు మెజారిటీ రాగా, ఫైనల్ గా 15 వ రౌండ్ మొత్తం పూర్తి అయిన తరువాత లెక్కలను పరిశీలిస్తూ బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10,309 ఓట్లతో విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థికి 97,006 ఓట్లు రాగా, బీజేపీకి 86,697 ఓట్లు పోలైయ్యాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి శ్రవంతిరెడ్డి 23,906 ఓట్లు పోలైయ్యాయి. కాంగ్రెస్ పార్టీ డపాజిట్ కోల్పోయ్యిందనే చెప్పాలి.

ఇది కూడా చదవంఢి: టీఆర్ఎస్ ది గెలుపు కాదు.. నాదే నైతిక గెలుపు: రాజగోపాల్ రెడ్డి

== బీజేపీ ఆశలకు నీళ్లు చల్లిన మునుగోడు ఓటర్లు

మునుగోడు నియోజకవర్గం పై రాజగోపాల్‌ రెడ్డి, బీజేపీ నాయకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. సాధాహరణ ఎన్నికల కంటే ముందుగా జరిగే ఎన్నిక కావడంతో మునుగోడు గెలిచి టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నయ పార్టీ బీజేపేనని, రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని చెప్పందేకు ప్రయత్నం చేసిన కమలదళం ఆశలకు మునుగోడు ప్రజలు నీళ్లు చల్లారు. ద ఓటమి చెందారు. హుంకరించిన బిజెపి కూడా తలవంచింది. ఉప ఎన్నిక ద్వారా గెలిచి సవాల్‌ విసరాలన్న బిజెపి కుయుక్తు లను మునుగోడు ప్రజలు తిప్పికొట్టారు. మొత్తంగా టిఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి 11వేల 666 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్టు కోల్పోయారు. ఉదయం నుంచి మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్‌ హోరాహోరీగా కొనసాగింది. ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కారు గుర్తు దూసుకువెళ్లింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం ఖాయం కావడంతో బిజెపి అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డి తన ఓటమిని అంగీకరించారు.

== దేశాన్ని అకర్షించిన మునుగోడు ఉప ఎన్నిక

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయ దుందుభి మోగించింది. ప్రతి రౌండ్‌లోనూ అధికార పార్టీ ఆధిక్యం ప్రదర్శించి, విజయాన్ని ముద్దాడిరది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వానికే మునుగోడు ప్రజలు పట్టం కట్టారు. కవిూషన్ల కాంట్రాక్టర్‌కు చరమగీతం పాడి, అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న అధికార పార్టీకే జై కొట్టారు. భారత్‌ రాష్ట్ర సమితికి పునాది రాయి వేసి.. దేశ దృష్టిని ఆకర్షించారు మునుగోడు ఓటర్లు. నిత్యావసర ధరలతో పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్న మోదీకి కనువిప్పు కలిగించారు. బీజేపీ ఆటలు, మోదీ మోసాలు తెలంగాణలో సాగవని నిరూపించారు మునుగోడు ప్రజలు. ప్రతిపక్షాల ఆశలను చిత్తు చేసింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్‌ కోల్పోయింది. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి విజయం సాధించారు. రౌండ్‌ రౌండ్‌కు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆధిక్యం పెరుగుతున్నది. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ ఘోర ఓటమిని చవి చూసింది. కనీసం డిపాజిట్‌ను కూడా దక్కించుకోలేకపోయింది. 15 రౌండ్లలో ఏ ఒక్క రౌండ్‌లోనూ కాంగ్రెస్‌ ఆధిక్యం ప్రదర్శించలేదు. మొదటి నుంచి చివరి రౌండ్‌ వరకు మూడో స్థానంలోనే ఉండిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి.. కౌంటింగ్‌ కేంద్రం నుంచి ఉదయం 10 గంటల సమయంలోనే వెళ్లిపోయింది. ఇక ఆ తర్వాత కౌంటింగ్‌ కేంద్రం వైపు కాంగ్రెస్‌ కార్యకర్తలు కన్నెత్తి కూడా చూడలేదు. డిపాజిట్‌ కూడా కోల్పోవడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

 == నైతికంగా నేనే గెలిచా : రాజగోపాల్ రెడ్డి

ఇకపోతే మునుగోడు ఉప ఎన్నికలో నైతికంగా తానే గెలిచినట్లు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తెలిపారు. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడిరదని ఆరోపించారు.టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు పోలింగ్‌ రోజు కూడా డబ్బులు పంచి ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారన్నారు. తనను ప్రచారం చేయనివ్వ లేదని.. ప్రజాస్వా మ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. కేసీఆర్‌ అవినీతి సొమ్ముకు కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని విమర్శించారు. మునుగోడు విజేత ఎవరో దాదాపుగా తేలిపోయింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధిక్యంలో కొనసాగడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఓటమిని అంగీకరించారు. మునుగోడులో అధర్మం గెలిచిందని ఆక్రోశం వెళ్లగక్కారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అదికార దుర్వినియోగానికి పాల్పడిరదని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ఆ పార్టీ నేతలు ప్రజల్ని బెదిరించారని తెలిపారు. అంతేకాదు ప్రజలను ప్రలోభాలకు గురి చేశారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడు తానని ప్రకటించారు. నైతిక విజయం తనదేనని అన్నారు. ప్రజల పక్షాన ఉండాల్సిన కమ్యూనిస్టులు డబ్బులకు అమ్ముడు పోయారని రాజగోపాల్‌రెడ్డి దుయ్యబట్టారు.