యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిందే: భట్టి
(హైదరాబాద్-విజయంన్యూస్);-
తెలంగాణలో యాసంగిలో రైతులు సాగు చేసిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని సీల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం ఆసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ…. కేంద్రం కొనుగోలు చేయడంలేదన్న నెపంతో ధాన్యం కొనుగోలు చేయమనడం సరికాదన్నారు. కేంద్రంపై యుద్దం ప్రకటిస్తూనే తెలంగాణ రైతులను ఆదుకోవడానికి ఖచ్చితంగా ధాన్యం కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా రైతు బంధు పథకం తోపాటు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఆనేక పథకాలను కొనసాగించాలని కోరారు. రైతు బంధు ఇస్తున్నామని రైతులకు ఇవ్వాల్సిన ఆనేక రాయితీలు, ప్రోత్సహాకాలను బంద్ చేయకుండ కొనసాగించాలని కోరారు. పాలిహౌజ్, డ్రిప్, స్ప్లింకర్స్, స్ప్రేయర్స్ ఇలా వ్యవసాయ యంత్ర పరికారాలను ఇవ్వాలన్నారు.
also read;-అందమైన ప్రేమ కథ ‘రాధేశ్యామ్’
పందిరి సాగు కోసం లక్ష నుంచి 5లక్షల వరకు సాయం చేయాలని కోరారు. అదే విధంగా పావలా వడ్డీ రుణాలు రూ.3లక్షల వరకు ఇవ్వాలన్నారు.వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేసుకోవాలని చెప్పి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. వ్యవసాయ క్షేత్రాలకు అధికారులను పంపించి భూ సార పరీక్షలు చేయించి ఆభూమికి అనువుగా పంటలు వేయించాలని, ఇందుకు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అదే విధంగా నకిలి విత్తనాలను మార్కెట్లోకి రాకుండా కట్టడి చేయాలని కోరారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో తన పాదయాత్ర సందర్భంగా ఒక ఊరిలో రైతులు సాగు చేసిన మొక్క జొన్న నకిలి విత్తనాలతో ఆఊరిలో వేసిన పంట మొత్తం దెబ్బతిన్నదని సభ దృష్టికి తీసుకువచ్చారు.
also read;-భారీ రెమ్యునరేషన్లలో బాలీవుడ్ హీరోయిన్స్
పత్తి, మిర్చి రైతులు సైతం నకిలి విత్తనాలతో దిగుబడి రాక నష్టపోయారని తెలిపారు. నకిలి విత్తనాలు మార్కెట్లోకి రాకుండా పూర్తిగా కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సును ఇంటర్మీడియేట్‌తో సమానంగా గుర్తించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
45 సంవత్సరాలు నిండిన గీత కార్మికులకు ఫించన్ ఇస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు అమలు కావటంలేదు. ఎప్పటి నుంచి ఇస్తారో సభ వేదికగా చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే ఫించన్ ఇవ్వాలని కోరారు. అదే విధంగా తాటి వనాల పెంపకం కోసం ఐదు ఎకరాల స్థలం సొసైటీలకు ఇస్తామని చెప్పి పంపిణీ ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కడానికి ఎలక్ట్రిక్ మోకులు ఇవ్వాలన్నారు. నీరా ఉత్పత్తులు చేస్తున్నామని గత సమావేశంలో కూడ మంత్రి అదే బొమ్మ చూపించారని, ఇప్పడు అదే బొమ్మ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. మాటలు చెప్పడం కాదు ఆచరణలో చూపించాలని అన్నారు. నీర ఉత్పత్తులను ప్రోత్సహించి హైదరాబాద్‌లో విక్రయ కేంద్రం ప్రారంభిస్తే కల్తీ కల్లుకు సైతం చెక్ పెట్టినవారవుతారని తెలిపారు.
తాగండి… తాగండి .. అని అమ్మితే ఏలా
రహదారుల ఇరువైపులా బార్, వైన్స్ దుకాణాలు వెలుస్తున్నాయి. వాటిని తొలగించాలని కోరారు. వీటి వల్ల ప్రమాదాలు జరుగుతున్న సంఘటనలు ఇటీవల చూస్తున్నాము. ప్రమాదాల నివారణ కోసం తక్షణమే రహదారులకు ఇరువైపులా ఉన్న బార్లు, వైన్స్ దుకాణాలను తొలగించాలన్నారు. అదే విధంగా డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా మార్చడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలి. మధ్యం అమ్మకాలను విపరీతంగా పెంచడం ప్రజల ఆరోగ్యాన్ని సైతం పరిగణలోకి తీసుకోండి. తాగండి తాగండి అంటూ విపరీతంగా అమ్మకాలపైన దృష్టి సారిస్తే ప్రజల ఆరోగ్యం ఏం కావాలని అనుకుంటున్నారు. ఇది సమజానికి మంచిది కాదని అన్నారు. శ్రామికుల ఆధాయాన్ని కొల్లగొట్టే విధంగా చీఫ్ లిక్కర్ ధరలు ఉన్నాయన్నారు. ఈధరలు వందకు పైగా ఉంటే శ్రామికుల కూలీ మద్యానికే వెచ్చిస్తే వారి కుటుంబాల జీవనం ఏం కావాలో సర్కారు ఆలోచన చేయాలన్నారు. కష్ జీవులను దృష్టిలో పెట్టుకొని మధ్యం ధరలు వారికి అందుబాటులో ఉండాలి. భట్టి అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖ మంత్రి నీరంజన్‌రెడ్డి, అబ్కారీ శాఖ మంత్రి శ్రీనువాస్గౌడ్లు సమాధానం ఇచ్చారు.