Telugu News

మిర్చి రైతులను ఆదుకోవాలి

మొక్క శేఖర్ గౌడ్

0

మిర్చి రైతులను ఆదుకోవాలి
–మొక్క శేఖర్ గౌడ్

తామర పురుగు వల్ల తీవ్రంగా నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలని ఎకరాకు లక్ష రూపాయల చొప్పున ఇవ్వాలని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం నాడు సంజీవరెడ్డి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు కౌలు కట్టలేక పెట్టుబడి రాక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆత్మహత్య చేసుకుంటున్న ప్రతి రైతు కుటుంబానికి పది లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గానీ మంత్రులు గాని నష్టపోయిన మిర్చి రైతులను మిర్చి తోటలు గాని ఇంతవరకు పరిశీలించలేదని ఎకరాకు రెండు లక్షల రూపాయలు ఖర్చు చేశారని ఇక రైతులు చేసేదేమిలేక చేతులెత్తేశారని ప్రత్యేక ప్యాకేజి కేటాయించి మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని .రాష్ట్రంలో మిర్చి రైతుల పట్ల ప్రభుత్వం వహిస్తున్న అలసత్వం పట్ల సీతారామ ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి నలభై లక్షల రూపాయలు ఇవ్వకపోవటం పట్ల నిరసనగా జనవరి 2 నలేదా మరెప్పుడున్నా ఖమ్మంలో జరిగే కెటిఆర్ పర్యటనను అడ్డుకోవాలని జిల్లా కిసాన్ కాంగ్రెస్ కమిటీ తీర్మానించింది

కెటిఆర్ పర్యటనకు ముందే మిర్చి రైతుల గురించి ఏదైనా ఒక ప్రకటన చేయాలని లేనిపక్షంలో ఎట్టిపరిస్థితిలోనైనా కెటిఆర్ పర్యటనను అడ్డుకుంటామని రాష్ట్రంలో ఆర్థికంగా చితికిపోయిన రైతులు తమ హక్కుల కోసం నిరసన తెలియజేసే హక్కు కూడా లేకుండా పోలీసులతో నిర్బంధిస్తున్నారని రాష్ట్రంలో ప్రజాస్వామ్య లేదని మొత్తం పోలీసు రాజ్యం నడుస్తున్నదని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య ఖమ్మం కార్పొరేటు పరేదా భేగం జిల్లా కిసాన్ కాంగ్రెస్ నాయకులు మండెపూడి ఆనందరావు మండెపూడి నాగయ్య చన్నీళ్ల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు

also read :-మేడారం జాతర ఏర్పాట్లు,నిర్వహణపై మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి,సత్యవతి రాథోడ్ సమీక్ష