Telugu News

ముస్తాఫాతో భట్టి ములాఖాత్.

చంచల్ గూడ జైల్లో కలిసిన భట్టి.

0

ముస్తాఫాతో భట్టి ములాఖాత్.
చంచల్ గూడ జైల్లో కలిసిన భట్టి.
కాంగ్రెస్ సీనయర్ నేత.

ఖమ్మం కార్పోరేటర్ మహ్మద్ రఫీదాబేగం భర్త ముస్తాఫాతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ములాఖాత్ అయ్యారు.. ఇటీవలే పీడీ యాక్ట్ కేసులో అరెస్టు అయి చంచల్ గూడ జైల్లో ఉన్న ముసాఫాను భట్టి విక్రమార్క గురువారం కలిసి మాట్లాడారు. జైలు అధికారుల ఆదేశాల మేరకు ఆయన చంచల్ గూడ జైల్ కు వెళ్లిన భట్టి ముస్తాఫాతో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది.

కుటుంబ పరిస్థితులను భట్టి ముస్తాఫాకు వివరించినట్లు సమాచారం. రాజకీయాల గురించి చర్చించే అవసరం ఇప్పుడు లేదని భట్టి ముస్తాఫాకు తెలిపినట్లు సమాచారం. ఎలాంటి ఇబ్బందిలేకుండా మంచిగా దైర్యంగా ఉండాలని, కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అదుకుంటుందని, మేమంతా మీ కుటుంబానికి అండగా ఉంటామని దైర్యం చెప్పి భరోసా కల్పించినట్లు తెలుస్తోంది. భట్టి విక్రమార్కతో పాటు ఖమ్మం నగర కమిటీ అధ్యక్షుడు ఎండీ .జావిద్, కార్పోరేటర్ దుద్దుకూరు వెంకటేశ్వర్లు హాజరయ్యారు.

also read :- స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏకగ్రీవం.