Telugu News

గ్రామ పంచాయతీ టాంకర్ దుర్వినియోగం

ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ముత్యాలగూడెం సర్పంచ్

0

గ్రామ పంచాయతీ టాంకర్ దుర్వినియోగం

== నూతన ఇంటి నిర్మాణానికి పంచాయతీ ట్రాక్టర్, ట్యాంకర్ ను వినియోగిస్తున్న ప్రజాప్రతినిధి

== ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ముత్యాలగూడెం సర్పంచ్

(కూసుమంచి -విజయం న్యూస్)

అధికారబలం..నేతల సపోర్టు..ఉద్యోగుల సహాకారం వెరసి అధికారపార్టీ కి చెందిన ఓ ప్రజాప్రతినిధి పంచాయతీ ట్రాక్టర్ ను తన స్వంతపనులకు వాడుకుంటున్నారు. ఒక పంచాయతీకి చెందిన ట్రాక్టర్, ట్యాంకర్ ను మరో పంచాయతీకి చెందిన  ప్రజాప్రతినిధి నూతనంగా నిర్మాణం చేస్తున్నా ఇంటి పనులకు ఉపయోగిస్తున్నారు.

ఇది కూడా చదవండి:- “కందాళ”కు పరీక్షే నా..?

దీంతో సర్పంచ్ పూర్తి ఆధారాలతో సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన పోటోలు, వీడియోలను గ్రూపులో పంపించండంతో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కూసుమంచి మండలం తుర్కగూడెం గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్, ట్యాంకర్ ను ముత్యాలగూడెం పంచాయతీలోని ఎంపిటిసినూతనంగా నిర్మాణం చేస్తున్న ఇంటి పనులకు ఉపయోగిస్తున్నట్లు ముత్యాలగూడెం సర్పంచ్ బొల్లికొండా శ్రీనివాస్ పోటోలు, వీడియోలతో సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గత పది రోజుల నుంచి ట్రాక్టర్, ట్యాంకర్ ను ఎంపీటీసీ ఉపయోగిస్తున్నారని తెలిపారు. పంచాయతీ ట్రాక్టర్ ను ఏ ఒక్కరి వ్యక్తి గత పనులకు ఉపయోగించకూడదు. ట్రాక్టర్, ట్యాంకర్ పంచాయతీ పనులకు ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ బాధ్యత సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి పై ఉంటుంది. ఒక వేళ వేరే వ్యక్తుల స్వంతం పనులకు

ఇది కూడా చదవండి:- తుమ్మలపై నెటిజన్ల ప్రశంసలు..విమ్మర్శలు

ఉపయోగిస్తే కచ్చితంగా సంబంధిత సర్పంచ్, కార్యదర్శి పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆ విషయంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ అనేక మందిపై సస్పెన్స్ చేయడం జరిగింది. అది తెలిసి కూడా పంచాయతీ ట్రాక్టర్, ట్యాంకర్ ను వ్యక్తిగత పనులకు వాడుకోవడం పట్ల నెటిజన్లు విమ్మర్శలు వర్షం కురిపిస్తున్నారు. ఎంపీటీసీగ్రామపంచాయతీ బోర్ ను, పంచాయితీ, సిబ్బంది నీ అడగకుండా తన ఇష్టం వచ్చినట్టు నీటిని ట్యాంకర్ లో నింపటం జరుగుతుందని స్థానికులు తెలిపారు.

ఇది కూడా చదవండి:- స్వంత గూటికా..?సోదరి గూటికా..?  పొంగులేటి దారేటు..?

సిబ్బంది అడిగితే మీరేం చేసుకుంటారో చేసుకోండి, కావాలంటే కేసు పెట్టుకో నన్ను ఏం చేయలేరు అని బెదిరించినట్లుగా పోస్టు చేశారు.ఇలా గ్రామపంచాయతీ నీరు దుర్వినియోగం అవుతున్నాయి.అసలే గ్రామం లో నీటి సమస్య వుంది….ఇలా చేయటం వల్ల నీటి సమస్య ఇంకా ఎక్కువైంది.

మరీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

అందుకు సంబందించిన వీడియోలు దిగువున