Telugu News

నాన్న గెలుపే లక్ష్యంగా..నామ తనయుల ప్రచారం

ప్రచారంలో దూసుకుపోతున్న ఎంపీ నామ కుమారులు*

0

నాన్న గెలుపే లక్ష్యంగా..నామ తనయుల ప్రచారం

*ప్రచారంలో దూసుకుపోతున్న ఎంపీ నామ కుమారులు*

*మనవడా.. నీవు నామా బాబువా…ప్రచారంలో ఓ అవ్వ ఆప్యాయంగా పలకరింపు…*

*👉మా నాన్న కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో పార్లమెంట్ కు పంపండి…*

*👉స్థానికేతరులను, ఇతర పార్టీల వారిని మాటలను నమ్మకండి*

*👉కేంద్రం నుంచి నిధులు రప్పించి అభివృద్ధి పరచడంలో మా నాన్నగారిది ప్రత్యేక స్థానం.

*👉 ఖమ్మం 55వ డివిజన్లో బిఆర్ఎస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ లోక్ సభ అభ్యర్థి నామా తనయులు పృథ్వితేజ, భవ్యతేజ, సాయిరాంల విస్తృత ప్రచారం…

(ఖమ్మం -విజయం న్యూస్)

*బిఆర్ ఎస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ లోక్ సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ… నామా నాగేశ్వరరావు తనయులు పృద్వీ తేజ, భవ్యతేజ, సాయిరాoలు శుక్రవారం సాయంత్రం ఖమ్మం నగరంలోని 55వ డివిజన్ లో విస్తృత ప్రచారం నిర్వహించారు.. ప్రచారంలో భాగంగా ఓటర్లు నామ నాగేశ్వరరావు తనయులను ఇక్కడి ఓటర్లు స్వయంగా చూసి..బాబు.. నీవు.. నామ గారి బాబువా… అని ఆప్యాయంగా పలకరించి మీ నాన్నగారు మాకు బాగా పరిచయమని కుటుంబ సభ్యులవలె ఆదరిస్తూ.. మాఓటు నామ గారి కారు గుర్తుకే వేస్తాం..మీరు నిశ్చింతగా ఉండండి..అని ప్రతిచోట ఓటర్లు ఎంపి అభ్యర్థి నామ తనయులకు ఆప్యాయంగా బదిలిస్తుంటే నామాగారి గెలుపు నల్లేరుపై నడకేనని అక్కడి ప్రజలు పేర్కొoటున్నారు….ఎంపి అభ్యర్థి బరిలో నిలిచిన ఇతర పార్టీల నాయకులు స్థానికులు కాదని.. మా నాన్నగారు స్థానికులు అని..మా నాన్న కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో పార్లమెంటుకు పంపాలని వారు ఓటర్లను కోరారు.. ఓటర్లను ఓటు అభ్యర్థిస్తూ బిఆర్ఎస్ పార్టీకి చెందిన కరపత్రాలను ఓటర్లకు అందజేస్తూ గడప గడపకు వెళ్లి నామ విజయాన్ని కాంక్షిస్తూ.. విస్తృత ప్రచారం నిర్వహించారు..ఈసందర్భంగా ప్రతి చోట ఓటర్లు నామా నాగేశ్వరరావు తనయుల ప్రచారం మరియు వారి ఆప్యాయతానురాగాలను చూసి.. ఓటర్లు విశేష స్పందన కనబరిచారు..ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ నాయకులు మోతారపు సుధాకర్, మధు రమేష్, ప్రసాద్ లు తో పాటుగా స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.