Telugu News

ప్రజలతోనే నా జీవితం: నామా

కార్యకర్తలు, ప్రజలే దేవుళ్ళు

0

ప్రజలతోనే నా జీవితం: నామా

❇️ నామానే కావాలి… నామనే రావాలి

❇️ నామకు ప్రజలు బ్రహ్మ రధం

❇️ నామాతో ఏకమైన కార్యకర్తలు

❇️ కార్యకర్తలు, ప్రజలే దేవుళ్ళు

❇️ వారి తర్వాతే ఎవరైనా

❇️ బుగ్గపాడు, తుంబూరు, అడసర్లపాడు గ్రామాల్లో జరిగిన రోడ్డు షోల్లో నామ నాగేశ్వరరావు కు కార్యకర్తలు, ప్రజలు నీరాజనం

(సత్తుపల్లి -విజయం న్యూస్)

బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్ది నామ నాగేశ్వరరావు శుక్రవారం రాత్రి సత్తుపల్లి నియోజకవర్గoలోని బుగ్గపాడు, తుంబూరు, అడసర్లపాడు లో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తో కలిసి నిర్వహించిన బ్రహ్మాండమైన రోడ్డు షోలకు ప్రజలు బ్రహ్మరధం పట్టి,ఘన స్వాగతం పలికారు.

ఇది కూడా చదవండి:- దొర బిడ్డ కావాలా..? గడి దొర కావాలా..?: నామా 

తమ గ్రామాలకు వచ్చిన నామపై పూలు చల్లుతూ అభిమానం చాటుకున్నారు. మళ్లీ మాకు మీరే కావాలి… మీరే రావాలంటూ సాదర స్వాగతంతో అబ్బురపర్చారు.గతంలో తప్పిదం చేశాము..ఈ ఎన్నికల్లో సరిదిద్దుకుని, నామ గారిని అద్భుత మెజార్టీతో గెలిపించుకుంటామని కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు స్పష్టం చేశారు. నామ వూళ్ళోకి రాగానే పట్టరాని సంతోషం తో ఎదురేగి, అక్కున చేర్చుకున్నారు.
ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్యకర్తలు, ప్రజలే దేవుళ్ళు ..దిశా నిర్దేశకులు..వారి కోసమే నా జీవితం అంకితమని, వారి సేవా లోనే తృప్తి ఉందని అన్నారు. ప్రజలు రెండు సార్లు మంచి మెజార్టీతో గెలిపించి, పార్లమెంట్ కు పంపిస్తే జిల్లా గౌరవాన్ని ఢిల్లీలో ప్రతిధ్వనింప జేశానని అన్నారు.దేశంలోని ఎంపీలందరిలో అత్యధిక శాతం పార్లమెంట్ కు హాజరై, ప్రజా సమస్యలపై మరిన్ని ప్రశ్నలు అడిగి ఉత్తమ పార్లమెంట్ మెంబర్ గా గుర్తింపు పొంది, జిల్లా ఖ్యాతిని దేశం నలుమూలల కీర్తింప జేశానని అన్నారు. తాను పుట్టిన తెలంగాణ గడ్డ కోసం , ప్రజల హక్కులు, రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు కోసం కోట్లాది అలుపెరగని పోరాటం చేశానని చెప్పారు.

ఇది కూడా చదవండి:- బీసీ కులాలన్నీ ఏకమై కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి: నామా

మళ్లీ అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి కి శ్రామిస్తానని తెలిపారు. ప్రస్తుత క్లిష్ట సమయంలో బీఆర్ ఎస్ ఎంపీ లు పార్లమెంట్ లో ఉండాలని, మాట్లాడే సత్తా, కొట్లాడే దమ్ము, ధైర్యం ఒక్క బీఆర్ ఎస్ ఎంపీలకు మాత్రమే ఉందని అన్నారు తనను మంచి మెజార్టీతో గెలిపించి, కేసీఆర్ కు మద్దతుగా , చేదోడు వాదోడుగా అండగా నిలవాలని నామ నాగేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మాజీ డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మండలాలు, ఆయా గ్రామాల స్థానిక నాయకులు, జెట్పీటీసీ, ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.