Telugu News

కాంగ్రెస్ గెలుపే నా ధ్యేయం…: రాయల

పాలేరు రేసులో నేను ముందున్నా

0

కాంగ్రెస్ గెలుపే నా ధ్యేయం…: రాయల

== పాలేరు రేసులో నేను ముందున్నా

== ఎప్పుడో మాట్లాడిన వీడియోను పట్టుకుని అధికార పక్షం పబ్బం గడుపుకుంటుంది

== పార్టీలోకి ఎవరు వచ్చినా మా నాయకులే

== విలేకర్లు సమావేశంలో పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు

(నేలకొండపల్లి -విజయం న్యూస్)

కాంగ్రెస్ గెలుపే నా ధ్యేయమని, రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంతో పాటు ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నానని పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. నేలకొండపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  పాలేరు రేసులో నేను ముందున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేశామని, పదేళ్ళుగా పార్టీలో ఎలాంటి పదవి లేకపోయినా కార్యాకర్తలకు అండగా ఉంటూ భరోసానిస్తూ కష్టకాలంలో అండగా ఉంటూ, అదుకుంటూ వచ్చానని అన్నారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డానని, అధికార పార్టీకి భయపడుతున్న తరుణంలో ఎమ్మెల్సీగా ఖమ్మం నుంచి పోటీ చేసి, అధికార పార్టీకి  ముచ్చేమటలు పట్టించామని అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో పార్టీని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లామన్నారు.

ఇది కూడా చదవండి: ఖద్దర్ పాలన..ఖరీదైన రాజకీయాలు.. ఖతమైన బంధాలు

కష్టపడిన వారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం  గుర్తింపు నిస్తుందని, ఆ నమ్మకం నాకు ఉందన్నారు. నా గురించి అధిష్టానమే అన్నీ చూసుకుంటుందన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సందర్భాలలో చాలా మందికి న్యాయం చేసిన ఘటనలు ఉన్నయ్యాన్నారు.  పార్టీ లోకి ఎవరు వచ్చినా వాళ్ళను మా నాయకులు గానే చూస్తామన్నారు.  ఎప్పుడో మాటలను సామాజిక మాధ్యమాలలో ట్రోల్ చేసి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారరి ఆరోపించారు. నా ప్రయత్నాన్ని కాంగ్రెస్ పెద్దలు గుర్తించారని అన్నారు. నాకు టిక్కెట్ వస్తుందనే నమ్మకం నాకు ఉందని, నా కోసం పనిచేస్తున్న నాయకులందరు కూడా నాకు టిక్కెట్ వస్తుందని చెబుతున్నారని, పాలేరు నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ అదిష్టానం కూడా అదే చెబుతుందని అన్నారు. నేను కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని, పార్టీలోకి ఎవరు వచ్చిన కచ్చితంగా వాళ్లందరు మా పాార్టీ వాళ్లుగానే గుర్తిస్తామని అన్నారు. పదేళ్ల పాటు పదవులు లేకుండా పార్టీ కోసం పనిచేశామని, రాబోయే రోజుల్లో మరింతగా కష్టపడి పాలేరులో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తానని హామినిచ్చారు.

ఇది కూడా చదవండి: తుమ్మల “ఖమ్మం” లో పోటీ..?