Telugu News

నా స్పీడు తగ్గదు.. అభివృద్ది ఆగదు.. మంత్రి పువ్వాడ.

▪️టిఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక సంక్షేమ ప్రభుత్వం. ▪️సంఘటిత, అసంఘటిత అనే తేడా లేకుండా కార్మికులందరికీ ప్రయోజనం కల్పిస్తున్న ప్రభుత్వం. ▪️దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం ద్వారా అత్యుత్తమ కార్మిక సంక్షేమం అమలు. ▪️ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా కార్మికులకు శుభాకంక్షలు తెలిపిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు..

0

నా స్పీడు తగ్గదు.. అభివృద్ది ఆగదు.. మంత్రి పువ్వాడ.

▪️టిఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక సంక్షేమ ప్రభుత్వం.

▪️సంఘటిత, అసంఘటిత అనే తేడా లేకుండా కార్మికులందరికీ ప్రయోజనం కల్పిస్తున్న ప్రభుత్వం.

▪️దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం ద్వారా అత్యుత్తమ కార్మిక సంక్షేమం అమలు.

▪️ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా కార్మికులకు శుభాకంక్షలు తెలిపిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు..

ఖమ్మం నగరాభివృద్దిని ప్రతిపక్ష పార్టీలు అడుగుఅడుగునా అడ్డుకోవాలని చూస్తున్నారని, నా కాళ్ళల్లో కట్టెలు పెట్టీ మరీ అడ్డుకోవాలని చూస్తున్నారని, వాళ్లకు ఒక్కటే చెప్తున్నా.. నా స్పీడు తగ్గదు.. ఖమ్మం అభివృద్ది ఆగదు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు స్పష్టం చేశారు.

ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద TRSKV ట్రేడ్ యూనియన్ అధ్వర్యంలో మిర్చి మార్కెట్ నుండి మినీ వ్యాన్ ల భారీ ర్యాలీ చేపట్టారు.

అనంతరం TRSKV నాయకులు నున్నా మాధవరావు, పాల్వంచ కృష్ణ గారి అధ్వర్యంలో వివిధ ట్రేడ్ యూనియన్స్ అధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గోన్నారు.

ఖమ్మం నగరంలోని మిర్చి మార్కెట్ నుండి ర్యాలీగా పంపింగ్ వెల్ రోడ్, గాంధీ చౌక్, PSR రోడ్, గుంటి మల్లన్న టెంపుల్ రోడ్, నయా బజార్ సెంటర్, జూబ్లీ క్లబ్, బ్రిడ్జి మీదుగా మయురి సెంటర్, ఓల్డ్ బస్ స్టాండ్, జడ్పి సెంటర్, జమ్మిబండ, బోనకల్ x-రోడ్, చర్చ కాంపౌండ్ మీదగా మిర్చి మార్కెట్ వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా జడ్పి సెంటర్ నందు నిర్వహించిన సభలో మంత్రి పువ్వాడ మాట్లడుతూ..

కార్మికులు, కర్షకుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నాయకత్వంలోని టి.ఆర్.ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

సంఘటిత, అసంఘటిత రంగాలు అనే తేడా లేకుండా అన్ని వర్గాల సంక్షేమానికి సమానంగా కృషి చేస్తోందని వివరించారు.

నిర్మాణ రంగంలోని కార్మికుల సంక్షేమానికి బోర్డు ద్వారా గత ఏడాదిలో 176.91కోట్ల రూపాయల లబ్ది చేకూర్చినట్లు తెలిపారు. అదేవిధంగా గత ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాల ద్వారా 32,350 మంది కార్మికులకు రూ.184.07 కోట్ల రూపాయల ప్రయోజనం చేకురిందన్నరు.

also read :- ప్రైవేట్ మాటున పెరుగుతున్న శ్రమదోపిడి…

also read :-ఘనంగా ఆంధ్రప్రభ రిపోర్టర్ ఆధ్వర్యంలో కార్మికులకు యూనిఫామ్ వితరణ

కార్మిక శాఖలోని కార్యకలాపాలను పూర్తిగా ఆన్‌లైన్‌ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనేక జాతీయ అవార్డులను కైవసం చేసుకుందని, కార్మికులకు ఎక్కడి నుంచి అయినా ప్రభుత్వ సహకారం పొందే అవకాశం లభించిందన్నారు.

ఒక్కటి మాత్రం నిజం.. కేసీఅర్, కెటిఆర్ గారి నాయకత్వంలో నా తెలంగాణ ఎనిమిదేండ్ల స్వరాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సాక్షిగా.. అమెరికా తరువాత అంతర్జాతీయ కంపెనీలు తమ తమ వ్యాపార కార్యకలాపాలకు రెండవ కేంద్రంగా హైదరాబాద్ నగరాన్ని ఎంచుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్న అని అన్నారు.

దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం తీసుకురావడం వల్ల అంతర్జాతీయంగా పేరొందిన కంపెనీలు మన వద్దకు వస్తున్నాయని, తద్వారా కార్మికులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యతాప్రమాణాలతో కూడిన ఉపాధి, వేతనం లభిస్తోందన్నారు.

ఈ విధంగా కార్మికులకోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కార్మికుల సంపూర్ణ సంక్షేమానికి పాటుపడుతున్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు.

ఇక ఖమ్మం నగరభివృద్ధిని చూసి కొందరు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారని, మంచి వాతావరణంను చెడగొట్టడనికి ప్రత్యేకంగా కొందరు తయారయ్యారని విమర్శించారు..

పార్టీలు ఏవైనా కావచ్చు కాని, కొన్ని మతోన్మాద పార్టీలు ప్రత్యేకంగా ఖమ్మం చేరినై అని వాటికి దిమ్మతిరిగే సమాధానం ఇస్తామన్నారు. హైద్రాబాద్, ఢిల్లీ నుండి కొందరు మాట్లాడుతున్నారని.. మీకు కళ్ళు ఉంటే ఖమ్మం వచ్చి చూడండీ, అభివృద్ది మీద సవాల్ చేయండి.. సిద్దంగా ఉన్నా ఆని సవాల్ విసిరారు..

బిజేపి నాయకులు అభివృద్ది నిరోధకులుగా మారారని, నా కాళ్ళల్లో కట్టెలు పెట్టీ అడ్డుకోవాలని చూస్తున్నారని, వాళ్లకు ఒక్కటే చెప్తున్నా.. నా స్పీడు తగ్గదు.. ఖమ్మం అభివృద్ది ఆగదు.. అని స్పష్టం చేశారు.

తెరాస పార్టీకి ఖమ్మం కంచుకోట అని, అభివృద్దే మన ఎజెండా అని వ్యాఖ్యానించారు. నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు.

మరోసారి కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు.