Telugu News

నాది స్వరజన మతం.. నేను అందరి వాడను:మంత్రి పువ్వాడ 

బిసి ల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ..

0

నాది స్వరజన మతం.. నేను అందరి వాడను:మంత్రి పువ్వాడ 

*▪️బిసి ల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ..

(ఖమ్మం ప్రతినిధి -విజయం న్యూస్)

ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఏవిధంగా అన్ని కులాలను, మతాలను గౌరవిస్తూ సమన్వయం చేస్తూ అందరికీ రాజ్యాధికారం అందే విధంగా పని చేస్తుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

ఆదివారం మమత కళాశాలలో బీఆర్ఎస్ బిసి సెల్ నగర్ అద్యక్షుడు మేకల సుగుణ రావు అధ్వర్యంలో జరిగిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు..

ఇది కూడా చదవండి:-;పార్టీ శ్రేణుల్లో జోష్ నింపడానికే బైక్ యాత్ర:మంత్రి

కేసీఅర్ గారు బిసిలకు ఇచ్చిన ప్రాధాన్యత మన అందరికీ తెలుసు అని అన్నారు. మనం అత్యధిక సంఖ్యలో రాజ్యాధికారం లో బిసి లకు ప్రాధాన్యతను ఇచి గౌరవించుకున్నామని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి కబుర్లకు ఎవ్వరు మోసపోవద్దు అని, టిఆర్ఎస్ పార్టీ బీసీలు అభివృద్ధిని కోరుకునే పార్టీ.. బిఆర్ఎస్ పార్టీ బీసీల సంక్షేమాన్ని కోరుకునే పార్టీ అని అన్నారు.

బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవాళ కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ప్రత్యేకమైన శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు.

కుల వృత్తులు ప్రోత్సహించే విధంగా బిసి కులాలకు రూ.లక్ష ను గ్రాంట్ రూపంలో పంపిణి చేయడం జరిగిందన్నారు.

ఇది కూడా చదవండి:- బతుకమ్మ మన పూల పండగ: మంత్రి పువ్వాడ

ఖమ్మంలో 2000 గజాల్లో బీసీ భవనాన్ని నిర్మాణం చేసుకున్నాం.. బీసీలకు అనేక రాజకీయ పదవులు, నామినేటెడ్, పదవులు ఇచ్చి గౌరవించుకున్నామని అందుకే ఎవరు ఏం చెప్పినా ఎవరు ఏం మాట్లాడినా వచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పి చెప్పారు.

ఎవ్వరికీ ఎలాంటి ఆందోళన లేదని వచ్చేది, గెలిచేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో ఎన్నికల నియోజకవర్గాల సమన్వయకర్త ఆర్జేసీ కృష్ణ, మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, పగడాల నాగరాజు యాదవ్, ఏఎంసీ చైర్మన్ దోరేపల్లి శ్వేత, వసంత బాబు, గౌతమ్ బాబా, బిచ్చాల తిరుమల రావు, తొట్టి కొమరయ్య, తగిళ్ళపల్లి శ్రీనివాస్, తీగల సతీష్ గౌడ్, కందాలా వీరేందర్ గౌడ్, నాగరాజు యాదవ్, నగేష్ యాదవ్, సుంకర నర్సింహారావు, ముదిరాజ్ జిల్లా అధ్యక్షుడు మామిడాల వెంకటేశ్వర్లు, గౌడ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమరాగాని వెంకన్న గౌడ్, విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు పరబ్రహ్మం, MBC సెల్ రాష్ట్ర నాయకురాలు షేక్ షకీన, ముక్కాల రాజేష్, మోటే కుమార్, మాచర్ల ఏలాద్రి, దూదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిద్దా సాహెబ్, వట్టికోట అప్పారావు తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి:-;తెలంగాణలో హ్యట్రిక్ విజయం తథ్యం:మంత్రి