Telugu News

మా మామ మాటిచ్చారంటే.. శాసనమే: అశ్రితరెడ్డి

సినీ హీరో విక్టరీ వెంకటేష్ తనయ ఆశ్రిత

0

మా మామ మాటిచ్చారంటే.. శాసనమే: అశ్రితరెడ్డి

– సినీ హీరో విక్టరీ వెంకటేష్ తనయ ఆశ్రిత

(ఖమ్మం-విజయం న్యూస్)

మా మామయ్య రఘురాం రెడ్డి  చాలా పట్టుదల గలవారు. ఏదైనా పని మొదలుపెట్టారంటే.. 100% దానిని పూర్తి చేస్తారు. ఆయన మాటిచ్చారంటే అది..కచ్చితంగా అవుతుంది” అని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి పెద్దకోడలు, సినీ హీరో విక్టరీ వెంకటేష్ తనయ ఆశ్రిత అన్నారు. సోమవారం నగరంలోని ప్రసాద్ హైట్స్ రెసిడెన్సీ అసోసియేషన్ సమావేశానికి హాజరై.. మాట్లాడారు. నిత్యం ప్రజా సేవ చేయాలని మామ ఆలోచిస్తున్నారని.. అందరూ ఓటు వేసి మెజారిటీ అందించాలని కోరారు.