Telugu News

నా గెలుపు ఖాయం: నామ

నామ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు

0

నా గెలుపు ఖాయం: నామ

❇️ ఖమ్మం ఓటర్లు చైతన్యవంతులు…విజ్ఞులు

❇️ నామ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు

➡️ విలేకరుల సమావేశంలో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు , పార్టీ జిల్లా అధ్యక్షులు తాతా మధు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

(ఖమ్మం ప్రతినిధి -విజయం న్యూస్)

ఖమ్మం జిల్లా ప్రజలు ఎంతో చైతన్యవంతమైన వారు…. విజ్ణతతో ఆలోచించి ఓటు వేశారు.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీఆర్ఎస్ కే పడింది… తాను మంచి మెజార్టీతో గెలుస్తానన్న నమ్మకం, విశ్వాసం ఉందని బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో నామ మాట్లాడారు.ఏ గ్రామం వెళ్లినా కులమతాలకతీతంగా తనను ఆశీర్వదించి, మద్దతుగా నిలిచారని చెప్పారు. కేసీఆర్ రోడ్డు షో సందర్భంగా కూడా భారీగా తరలి వచ్చారని చెప్పారు. ఓటు మాత్రం సైలెంట్ గా వేశారని పేర్కొన్నారు.ఈ ఆరు నెలల కాలంలో తాగు, సాగు నీరు, కరెంట్ కోతల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీఆర్ఎస్ కే పడిందని భావిస్తున్నామని తెలిపారు. ఏది ఏమైనా తమకు అనుకూలంగా మంచి ఫలితాలు వస్తాయనే గట్టి నమ్మకం ఉందని చెప్పారు. తన విజయం కోసం అహర్నిశలు ..రేయింబవళ్లు శ్రమించిన పార్టీ మాజీ ఎమ్మెల్యే లు, ఇంచార్జ్ లు, సీనియర్ నాయకులు, జిల్లా, మండల, గ్రామ, బూత్ స్థాయి నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులకు ప్రత్యేకించి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు నామ పేర్కొన్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షులు , ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ నామ మచ్చలేని నాయకుడని, అత్యధిక మెజార్టీతో నామ గెలవ బోతున్నారని చెప్పారు. సామాజిక వర్గాలు, పార్టీలకతీతంగా నామ కు ఓట్లు వేశారని, ఆయన మంచి మెజార్టీతో గెలవబోతున్నారన్న నమ్మకం ఉందన్నారు.కేసీఆర్ మార్గదర్శకత్వంలో నామ విజయానికి కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించిన అధికారులకు, సిబ్బందికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. కార్యకర్తల్లో ఉత్తేజం నింపిన కేసీఆర్, హారీష్ రావు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విలేకరుల సమావేశంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఉప్పల వెంకట రమణ, కూరాకుల నాగ భూషణం, బిచ్చాల తిరు మలరావు, పగడాల నాగరాజు, ఆర్జేసీ కృష్ణ, బెల్లం వేణు గోపాల్, తాజుద్దీన్, తదితరులు పాల్గొన్నారు