నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం
10 క్రస్ట్ గేట్లు 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం
10 క్రస్ట్ గేట్లు 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల
(నాగార్జున సాగర్- విజయంన్యూస్)
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వస్తున్న వరదలకు శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నీటీని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ జలకళలాడుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.80 అడుగులకు చేరింది. కాగా ఎగువ నుంచి వస్తున్న వరదను 10 క్రస్ట్ గేట్లు దిగువకు విడుదల చేస్తున్నారు.
10 క్రస్ట్ గేట్లు 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల
ఇన్ ఫ్లో : 1,22,131 క్యూసెక్కులు..
ఔట్ ఫ్లో : 1,30,858 క్యూసెక్కులు.
పూర్తిస్దాయి నీటి మట్టం 590 అడుగులు..
ప్రస్తుత నీటి మట్టం :589.80అడుగులు.
పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0450 టీఎంసీలు…
ప్రస్తుతం :311.4474 టీఎంసీలు…