Telugu News

****నాగార్జున కొండకు లాంచీలు సిద్ధం

రెండు సంవత్సరాల తర్వాత పునర్ ప్రారంభం

0

****నాగార్జున కొండకు లాంచీలు సిద్ధం

*** రెండు సంవత్సరాల తర్వాత పునర్ ప్రారంభం
***(నాగార్జునసాగర్- విజయం న్యూస్);-

ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్ నందికొండ హిల్ కాలనీలోని లాంచిస్టేషన్ నుంచి లాంచీల పునర్ ప్రారంభానికి సర్వం సిద్ధం చేస్తున్నట్లు పర్యాటక శాఖ అధికారులు, లాంచీ స్టేషన్ అధికారులు తెలిపారు. గతంలో ఆంధ్రప్రదేశ్ లోని కుచ్చలూరు వద్ద జరిగిన లాంచ్ ప్రమాదం ఘటనతో తెలంగాణలోని నాగార్జున సాగర్ హిల్ కాలనీ లాంచ్ స్టేషన్, ఆంధ్రప్రదేశ్ లోని రైట్ బ్యాంక్ లాంచ్ స్టేషన్ల నుండి పూర్తిగా నాగార్జున కొండకు వెళ్లే లాంచీలు పూర్తిస్థాయిలో నిలుపుదల చేశారు.

also read :-మేడారం మహా జాతరలో అన్నీ తానై మంత్రి ఎర్రబెల్లి.

తిరిగి రెండు సంవత్సరాల అనంతరం ఆర్కియాలజికల్ అధికారుల నుండి అనుమతి లభించడంతో నేటి నుంచి నాగార్జున కొండకు హిల్ కాలనీ లాంచ్ స్టేషన్ నుండి లాంచీల నడపడానికి తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు నాగార్జున కొండకు లాంచీల రాకపోకలు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. శనివారం ఉదయం 9గంటల 30 నిమిషాలకు మొదటి లాంచీ ట్రిప్పు ప్రారంభమవుతుందని లాంచ్ స్టేషన్ అధికారులు తెలిపారు.