Telugu News

తెరుచుకున్న నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్లు 

దిగువకు 1,45,960 క్యూసెక్కుల నీరు విడుదల

0

తెరుచుకున్న నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్లు 

== ఎగువ నుంచి భారీగా వరద

== దిగువకు 1,45,960 క్యూసెక్కుల నీరు విడుదల

నాగార్జున సాగర్, ఆగస్టు 11(విజయంన్యూస్)

నల్లగొండ జిల్లా పరిధిలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువ నుంచి వరద ప్రవాహం భారీగా పెరగడంత నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా తొణికిసులాడుతోంది. గురువారం తెల్లవారుజామున 5 గంటలకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు సీఈ శ్రీకాంత్ రావు, ఎస్ఈ ధర్మానాయక్ 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు1,45,960క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గేట్లు ఎత్తడంతో నాగార్జున సాగర్ డ్యామ్ దిగువకు నీరు పాల పొంగులా ఉప్పొంగింది. కృష్ణమ్మ పరవళ్లు వీక్షించేందుకు పర్యాటకులు కూడా వస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయం కు  శ్రీశైలం డ్యామ్ నుంచి భారీగా వరద నీరు వస్తోంది. అక్కడ ఆ ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తుండటంతో ఎగువ నుండి4,27,136 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ డ్యామ్ వస్తుంది. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం587.90 అడుగులు ఉంది.

ఇది కూడా చదవండి :- పెరుగుతున్న గోదావరి వరద