Telugu News

సాగర్ డ్యాం 6 గేట్ల ద్వారా నీటి విడుదల

నాగార్జునసాగర్ డ్యాం 6 క్రస్ట్ గేట్ల ఐదు అడుగుల ఎత్తు ఎత్తి 48, 600 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల

0

సాగర్ డ్యాం 6 గేట్ల ద్వారా నీటి విడుదల

( నాగార్జునసాగర్ – విజయం న్యూస్):
నాగార్జునసాగర్ జలాశయం కు ఎగువ నుండి 98, 376 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో నాగార్జునసాగర్ డ్యాం 6 క్రస్ట్ గేట్ల ఐదు అడుగుల ఎత్తు ఎత్తి 48, 600 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయ నీటి శుక్రవారం నాటికి 590.00 (టీఎంసీలలో 312.0450)అడుగులకు చేరింది. జలాశయం పూర్తి నీటిమట్టం 590 అడుగులు . దీంతో సాగర్ జలాశయం నుండి కుడి కాలువకు 8, 145 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 7, 190 క్యూసెక్కులు, ప్రధాన విద్యుత్ కేంద్రం ద్వారా 32, 642 క్యూసెక్కుల నీరు, ఆరు క్రస్ట్గేట్ల ద్వారా 48,600 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1800 క్యూసెక్కుల నీరు, మొత్తం నీటి విడుదల 98, 376 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.5 0 అడుగులు గా ఉంది.

also read : చెవిటి,మూగ యువతి పై అత్యాచారం …?